తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : అలాంటివారికి దగ్గరగా ఉండడం కూడా మన తప్పే.. ఎందుకంటే..

Saturday Motivation : అలాంటివారికి దగ్గరగా ఉండడం కూడా మన తప్పే.. ఎందుకంటే..

26 November 2022, 6:33 IST

    • Saturday Motivation : జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగనిచ్చే వారితో ఉండండి. అంతేకానీ మీ గోల్స్ రీచ్ కాకుండా.. మిమ్మల్ని వెనక్కి లాగేవారితో ఉండకండి. మనతో ఉండి మనల్ని మనకి నచ్చినట్లు కెరీర్​లో ఎదగనిచ్చేవారే ముఖ్యం. అలాంటివారే మనకి తోడుగా ఉండాలి. అంతేకానీ వాళ్ల అభిప్రాయాలు మనపై రుద్దేసి.. వాళ్లకి అనుగుణంగా నడవాలి అనుకునేవారు మనకు ఏ మాత్రం అవసరం లేదని గుర్తించుకోండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : కొందరు ఎలా ఉంటారంటే.. మన గోల్స్​కి మనం రీచ్ కాకుండా.. మన అభిప్రాయాలను తొక్కేసి.. మన ఫీలింగ్స్​ని పట్టించుకోకుండా.. మనల్ని ఉద్దరిస్తున్నట్లు ఫీల్ అవుతారు. మీ జీవితంలో కూడా ఇలాంటి వారు ఉంటే.. వారికి వీలైనంత దూరంగా ఉండండి. మిమ్మల్ని ప్రేరేపించి.. నువ్వు సాధించగలవు అని చెప్పి.. ఓడిపోయినా కూడా లేచి పోరాడు అని చెప్పే వారు మీతో ఉండేలా చూసుకోండి. ఈ సమయంలో మిమ్మల్ని ఉద్దరించే వారికన్నా.. ప్రోత్సాహించేవారే మీకు ముఖ్యం.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ.. మిమ్మల్ని మీరు ద్వేషించుకునేలా చేసే వారితో ఉండి.. మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. జీవితం చాలా చిన్నది. అలాంటి దానిని వాళ్లకోసం వదులుకోకండి. వాళ్లు నిన్ను పైకి లేపుతున్నట్లు ఫీల్ అవుతారు కానీ.. నిజం చెప్పాలంటే.. వాళ్లు నిన్ను మానసికంగా చంపేస్తారు. ఆ విషయం కొందరికీ తెలుస్తుంది. కొందరికి తెలియదు. తెలియని వాళ్లకి వెళ్లి చెప్పినా కాస్తైనా ప్రయోజనం ఉంటుంది. తెలిసిన వాళ్లు అయితే కావాలనే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారని అర్థం.

ఈ రకమైన టాక్సిక్ సంబంధాలను వీలైనంత త్వరగా వదిలించుకోండి. ఎందుకంటే.. వాళ్ల కోసం మీరు ఎన్ని త్యాగాలు చేసినా.. అవి వారికి కనబడవు. పైగా వారే మీకు లైఫ్ ఇస్తున్నట్లు తెగ గొప్పగా ఫీలైపోతారు. అలాంటివారి గురించి ఆలోచించినా.. వేస్టే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అది మీకు సరైనది కాదు. పైగా మీ టైం వేస్ట్ అవుతుంది. అలాంటి వాళ్లని మార్చాలనే ఆలోచన కూడా వేస్టే. ఎందుకంటే.. వాళ్లు ఏమి చేసినా మారరు.

ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎక్కడి రీచ్ అవ్వాలనేది మీ ఇష్టం. దానికోసం ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే ఆలోచనాశక్తి మీకు ఉంటుంది. ఈ విషయంపై మీకు క్లారిటీ ఉంటే.. ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. అంతేకాదండోయ్.. మిమ్మల్ని ఆపేవారు ఎవరో కూడా మీకు తెలిసిపోతుంది. వాళ్లు మిమ్మల్ని ఆపాలి అనుకుంటున్నప్పుడు మీ మనసు చెప్తుంది. ఎక్కడో తప్పు జరుగుతుంది అని. అలా అనిపించినప్పుడు.. వారికి దూరంగా జరగండి.

మీ ప్రేమనే వారి ఆయుధంగా చేసుకుంటూ.. మీరు వెళ్లకుండా వాళ్లు మిమ్మల్ని ఆపేస్తారు. అలాంటివారికి మీ ప్రేమ ఇవ్వడం కూడా వేస్టే. మనల్ని ప్రేమించేవారు కచ్చితంగా మనం జీవితంలో ఎదగాలని చూస్తారు. కాబట్టి మనల్ని ఆపాలి అనుకునేవారితో ఎంత వీలైతే అంత త్వరగా దూరమైపోండి. అదే మీకు మంచిది. మొదట్లో బాధగానే ఉన్నా.. జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఫీల్ అవ్వరు. మీ విలువను, ఆలోచనలను అర్థం చేసుకునే వ్యక్తులను ఎంచుకోండి. అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. విజయాన్ని పొందుతారు.

తదుపరి వ్యాసం