తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : మీ ఓటమికి మీరే కారణం అయితే బెటర్.. ఎవరికో క్రెడిట్ ఇవ్వడం ఎందుకు?

Saturday Motivation : మీ ఓటమికి మీరే కారణం అయితే బెటర్.. ఎవరికో క్రెడిట్ ఇవ్వడం ఎందుకు?

19 November 2022, 7:08 IST

    • Saturday Motivation : జీవితంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే.. పక్కన వాళ్ల సలహాలు తీసుకోండి. కానీ మీకు ఏది మంచిదో.. మీరు ఏది చేస్తే.. అనుకున్నది సాధించగలము అని నమ్ముతారో.. వాటనే చేయండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : కొన్నిసార్లు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విఫలం అవుతాం. మన ఓటమికి మనం కారణం అయితే పర్లేదు. అంటే వేరే వాళ్లు గెలవడానికి.. మనం ఓడిపోవడానికి కారణం మనం అయితే పర్లేదు. కానీ మనం ఓటమికి ఇతరులు కారణం అంటే.. వారికి దూరంగా ఉండటమే మంచిది. అలా అని మీ ఓటమికి కారణం ఎవరో ఒకరి మీద తోసేయమని కాదు. కొందరు మన మంచి కోసం సలాహా ఇస్తారు. వాళ్లు మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు అవి మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. కానీ కొందరుంటారు. తమకే అన్ని తెలుసు అని అహంకారంతో ఉంటారు. అలా వాళ్లు తమ మాటలతో మనపై ప్రభావం చూపించి.. మనల్ని తారుమారు చేస్తారు. అసలు వాళ్లు చెప్పింది వినకపోతే.. మనం ఎప్పటికీ గెలవలేము అన్నట్లు బిహేవ్ చేస్తారు.

మన దగ్గర ఇంకో సమస్య ఉంటుంది. అది ఏమిటంటే.. మనం ఒకేసారి చాలామంది వ్యక్తుల నుంచి పర్మిషన్ తీసుకుంటాము. అసలు మీరు చేయాలి.. మీరు సాధించాలి అనుకున్నప్పుడు వేరే వారి పర్మిషన్ తీసుకోవడం ఎందుకు. మీకు తెలుసు ఏది చేస్తే మంచిదో. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్​ అనిపిస్తే.. మీరు ఎవరి పర్మిషన్ తీసుకోనవసరంలేదు. మీకు అంతగా అనిపిస్తే.. సలహాలు తీసుకోవచ్చు. వారు చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వొచ్చు. లేదంటే మీకంటూ ఓ ప్లాన్ ఉంటుందిగా దానిని ఫాలో అయిపోండి. అంతేకానీ పర్మిషన్ తీసుకుంటూ పోయామంటే.. అది ఒక్కరితో ఆగదు. అయినా వారు మీ నిర్ణయాన్ని గౌరవించి.. మీకు పర్మిషన్ ఇవ్వరు. అది మీ లక్ష్యాన్ని సాధించడానికి అడ్డంకిగా మారుతుంది.

పైగా వారి నిర్ణయాన్ని కాదని.. మీరు మీ పోరాటం కొనసాగిస్తున్నా.. వాళ్లు మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు. ఎంత చెప్పినా వినట్లేదు.. నీతోని కాదు.. నీ పరిస్థితులు గురించి ఆలోచించుకున్నావా? నీ స్థోమత ఏమిటి? ఏంటి ఇప్పుడు నువ్వు సాధించేస్తావా? ఇలా అయితే నువ్వు బాగుపడవు అంటూ మిమ్మల్ని దొరికినప్పుడల్లా మానసికంగా బలత్కారం చేస్తారు. మన దరిద్రమో.. వాళ్ల అదృష్టమో ఫలించి.. మన ప్రయత్నంలో విఫలమయ్యామా? ఇంక అంతే. కరుడు గట్టిన రేపిస్ట్​కి కత్రినా కైఫ్ దొరికినట్టే. అసలు మేము ముందే చెప్పాము. మా మాట వింటేగా. అసలు మేమంటే లెక్కలేదు. మేము నీ బాగుకోసమే చెప్పాము. ఇలా చాలా నీతి వ్యాక్యాలు చెప్తారు కానీ.. మీకు ఆ పని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉందని ఆలోచించరు.

మీరు దానిని ఎందుకు సాధించాలి అనుకుంటున్నారో అనే విషయం తెలిసినా వాళ్లు.. మిమ్మల్ని ప్రోత్సాహిస్తారు. మీరు ఓడిపోయినా.. పర్లేదు మళ్లీ ట్రై చేయ్ అంటారు. మీరు బాధపడకుండా.. మీ పక్కనే ఉంటూ.. మీరు దానిని సాధించేవరకు మీతోనే ఉంటారు. ఇలాంటి వారు మీ పక్కన ఉంటే మీరు ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తారు. అంతే కానీ మీరు ఓడిపోయినా పర్లేదు కానీ.. మేమే తోపులం అనుకునేవారికి దూరంగా ఉండండి. కనీసం మీకు ప్రయత్నం చేశాను అనే సంతృప్తి అయినా ఉంటుంది. గెలుపు.. ఓటములు సహజమే. కానీ మీ ఓటమికి మీరు కారణం అయితేనే బెటర్. వేరే వాళ్లు మీ ఓటమికి కారణమైతే.. మీరు తీసుకోలేరు. సమాజం ఈ విషయం చెప్పినా నమ్మదు. ఓడిపోయారు కాబట్టి వేరే వాళ్లమీద ఆ నింద వేసేశారు అనుకుంటాది. లేదంటే గెలిస్తే ఇలాగే చెప్పేవారా.. మా గెలుపునకు వాళ్లే కారణమని.. అంటూ ప్రశ్నిస్తాది. కాబట్టి మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తప్పైనా.. ఒప్పైనా.. మీకు ఓ సంతృప్తి ఉంటుంది. మన జీవితం మన చేతుల్లో నాశనం అయితే కాస్తైనా బెటర్​గా ఉంటుంది మనకి. వేరే వాళ్ల చేతుల్లో నాశనం అవ్వడం కన్నా అదే వెయ్యి రెట్లు బెటర్.

తదుపరి వ్యాసం