Wednesday Quote : ఏదైనా సాధించాలి అనుకుంటే.. వెంటనే దానిని ప్రారంభించండి.. లేదంటే ఆశలు వదిలేసుకోండి-wednesday motivation on if we wait until were ready well be waiting for the rest of our lives ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote : ఏదైనా సాధించాలి అనుకుంటే.. వెంటనే దానిని ప్రారంభించండి.. లేదంటే ఆశలు వదిలేసుకోండి

Wednesday Quote : ఏదైనా సాధించాలి అనుకుంటే.. వెంటనే దానిని ప్రారంభించండి.. లేదంటే ఆశలు వదిలేసుకోండి

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 19, 2022 06:30 AM IST

Wednesday Motivation : మంచో, చెడో.. దానిని ప్రారంభించడానికి.. ఈరోజు కాదులే అబ్బా.. రేపటి నుంచి చేద్దామనుకునే ధోరణి ఎప్పటికీ మంచిది కాదు. మీరు అనుకున్నారా.. దానిని వెంటనే ఆచరణలో పెట్టడం మొదలుపెట్టండి. ఇలా పెండింగ్ పెట్టే స్వభావం ఉంటే.. అది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది తప్పా.. మనం స్టార్ట్ చేయడం ఉండదు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : వయసులో చేయాల్సిన పని.. ఆ వయసులోనే చేస్తే చూడ ముచ్చటగా ఉంటాది అంటారు. అది నిజమే కావొచ్చు. కానీ.. దేనిని ప్రారంభించడానికి ఇప్పటికీ ఏమి ఆలస్యం కాదు అని గుర్తించండి. ఏం వయసైపోతే.. పని చేయకూడదా? వయసైపోతే ఎంజాయ్ చేయాలని ఉండదా? వయసైపోతే ప్రేమించకూడదా? వయసైపోతే సొంత బిజినెస్ స్టార్ట్ చేయకూడదా… సక్సెస్ అవ్వకూడదా?

మీరు చేసిన పని మీకు కరెక్ట్ అనిపిస్తుంటే దానిని ఆలస్యమైపోయింది అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి. ఇలా అనుకునే మీరు చాలా విషయాల్లో ఆలస్యం చేసి ఉంటారు. అలాగే మిగిలిపోకండి. ఆలస్యం అమృతం విషం అన్నట్లు.. ఆలస్యంగా అయినా మొదలు పెడితే అది అమృతం అవ్వొచ్చు.. ఆలస్యంగా మొదలు పెట్టినా ఒక్కోసారి అది విషం కావొచ్చు.

ఏ పనినైనా ప్రారంభించడానికి ఆలస్యం అయిపోయిందనో.. తర్వాత చేద్దాంలే అనో.. రేపు స్టార్ట్ చేద్దామనో నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు అనుకుంటే కనీసం రేపు మొదలు పెట్టేందుకు అయినా.. నేటి నుంచి కసరత్తులు చేయండి. కొందరు రేపు చేస్తాము కదా అని రిలాక్స్ అయిపోతారు. మనం రేపు చేసేస్తామనే కాన్ఫిడెన్స్​లో ఉంటారు. కానీ చివరికి.. చేయాల్సిన సమయం వస్తే.. హా రేపు చేద్దాంలే అని నిర్లక్ష్యం చూపిస్తారు. ఇలా చేస్తూ పోతే.. మీరు ఎప్పటికీ ఆపనిని ప్రారంభించలేరు. ఒకవేళ ప్రారంభించినా అది ఎక్కువ కాలం నిలవదు.

దేనినైనా ప్రారంభించడానికి వయసైపోయిందని ఎప్పుడూ ఆలోచించకండి. ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కనీసం మానసికంగా అయినా మీరు తీసుకునే నిర్ణయం మీరు దృఢంగా ఉండండి. మీరు పరిమితిని పెట్టుకుంటున్నారంటే దానిని ఇంకా సాగదీయమని కాదు.. ఆ టైమ్​కి మీరు ఆ పనిని చేయాల్సిందే. వర్షమొస్తుందనో.. చలి వేస్తుందనో.. వైఫే లేదనో.. ఇలాంటి సాకులు వెతుక్కోకండి. మీరు నిజంగా ప్రారంభించాలని అనుకుంటే.. మీరు ఏదొక దారిని కచ్చితంగా వెతుక్కునే ఉంటారు.

మనం పూర్తిగా సిద్దమయ్యాకే పనిని ప్రారంభించాలనుకుంటే అది మనకు దక్కుతుందని చెప్పలేము. ఎందుకంటే.. మనం ప్రిపేర్ అయ్యేలోపు ఎవరో ఒకరు దానిని ఎత్తుకుపోతారు. మనం నిద్ర లేస్తే మనకు డే ఎలా స్టార్ట్ అవుతుందో.. ఏదైనా సాధించాలి అనుకుంటే.. మన ఆలోచనలు అలా స్టార్ట్ కావాలి. ఆ రోజును మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు ఉందిగా.. వేరే రోజు ఎందుకని ఆలోచించాలి. ఏ సమయమైనా సరైనదే. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ పెండింగ్ ఆలోచనల్ని మీరు మార్చుకోగలిగితే కనుక మీరు సగం సక్సెస్ అయిపోయినట్లే.

WhatsApp channel

సంబంధిత కథనం