Saturday Quote : కష్టంగా ఉన్నా.. కరెక్ట్ అనిపించిన పనే చేయండి..-saturday motivation on do what is right not what is easy nor what is popular ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Saturday Motivation On Do What Is Right Not What Is Easy Nor What Is Popular

Saturday Quote : కష్టంగా ఉన్నా.. కరెక్ట్ అనిపించిన పనే చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 16, 2022 09:54 AM IST

Saturday Quote : మనకు నచ్చిన పని చేయడంలో, మనకు కరెక్ట్ అనిపించిన పని చేయడంలో వచ్చే సంతృప్తి ఎక్కడా దొరకదు. కానీ మనకు నచ్చని పని.. ఈజీగా ఉందని.. రిజల్ట్స్ త్వరగా వస్తాయని ప్రయత్నించినా.. ఏదొకరోజు దాని గురించి ఫీల్ అవుతాము. కాబట్టి కష్టమనిపించినా.. కరెక్ట్​ పనే చేయండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మనం లైఫ్​లో ఎక్కువగా వినే సూచన ఏంటో తెలుసా? నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. ఈ విషయం మనకు చాలామంది చెప్తారు. మనం కూడా మనకి కరెక్ట్ అనిపించిన పనినే చేస్తాము. కానీ ఇక్కడ రిస్క్ ఏంటంటే.. మనం కరెక్ట్ అనుకుని ఏదైనా పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఆ పనిని ఆపేయకూడదు కదా. లేదా ఈజీగా అయిపోతుందని వేరే పని చేయలేము కదా. చేయకూడదు కూడా. మంచి మార్గంలో వెళ్లడం.. ఎప్పుడూ మిస్టేక్ కాదు.

సరైన పనులను చేయడం అనేది ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపికే. అయితే కొన్నిసార్లు సరైన పని చేస్తున్నప్పుడు.. కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే సరైన పని చేయకుండా కొంతమంది మిమ్మల్ని అడ్డుకునే అవకాశం కూడా ఉంది. కానీ మీరు ఎల్లప్పుడూ సరైన పని చేస్తున్నారని నిర్ధారించుకోవాలి. ఎవరో విషయం, ఆలోచనలని పక్కన పెడితే.. మీకు మీరు ప్రశ్నించుకోండి. మీరు చేసేది కరెక్టేనా? కాదా? అని. మీకే సమాధానం దొరుకుతుంది. మీరు చేస్తున్న పని చెడ్డది అనిపిస్తే.. అక్కడే దానిని ఆపేయండి.

కొందరు సురక్షితమైన, సులభమైన లేదా అందరూ చేస్తున్నారు కదా అని ఆ పనే చేస్తూ ఉంటారు. అందరూ చేస్తున్నారని.. లేదా ఈజీగా ఉందని చెడు మార్గంలో వెళ్లడం లేదా చెడు పనులు చేయడం ఏదొక రోజు మీకు ముప్పు కలిగిస్తాయి. కాస్త కష్టమైనా.. కరెక్ట్ దారిలో వెళ్తేనే మీకు మంచిది. తప్పుడు పనులు చేయడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు. దాని వల్ల ఏమి జరిగినా లేదా అవి ఎంత కష్టమైనా.. ఎల్లప్పుడూ సరైన పనులను చేయండి. సరైన పనులు చేయడం వల్ల ఇప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా మంచి ప్రయోజనాలు తప్పకుండా వస్తాయి. మంచి రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ చెడు చాలా త్వరగా తలుపు తట్టేస్తుంది.

ఇతరులకు సహాయం చేయడం మీకు మంచి పని అనిపిస్తుంది. ఎవరో చెప్పారని దానిని ఆపేయకండి. ఆ మంచి మీకు ఏదొక రోజు కచ్చితంగా తిరిగి వస్తుంది. మీరు ఇతర వ్యక్తులకు తగిన మేలు చేస్తుంటే.. వారు మీకు అవసరమైన సమయంలో మీకు సహాయం చేస్తారు. బదులుగా మీరు వారి ప్రేమను కూడా పొందుతారు. మీరు ఇతరులకు విలువ ఇస్తున్నప్పుడల్లా.. వారు కూడా మీకు విలువను తిరిగి ఇస్తారు. ఇది ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది జీవితంలో మీరు విజయం సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్