Saturday Motivation : మీరు ఓటమినుంచి ఏమి నేర్చుకోకపోతే.. అదే మీ నిజమైన ఓటమి..
Saturday Motivation : గెలుపు, ఓటములనేవి ఏదోక సమయంలో వచ్చి మనల్ని పలకరిస్తాయి. గెలుపుతో కంటే.. ఓటమితోనే చాలామంది ఎక్కువ సమయం గడుపుతారు. ఎందుకంటే అదే ఎక్కువగా వస్తుంది కాబట్టి. అయితే ఓటమినుంచి నేర్చుకున్నవాడు ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు. ఓటమి నుంచి ఏమి నేర్చుకోనివాళ్లే నిజమైన ఓటమిని చూసినట్లు లెక్క.
Saturday Motivation : ఓటమి నుంచి జీవిత సత్యాలు.. పాఠాలు నేర్చుకున్నవాడు ఎప్పుడు ఓటమిపాలు కాడు. ఎందుకంటే తన అనుభవాల నుంచి తాను కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు కాబట్టి. తరువాత ప్రయత్నంలో వాటిని ఉపయోగిస్తాడు. మళ్లీ ఓడిపోయినా.. ఈసారి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని ముందుకు వెళ్తాడు. అంతేకానీ ఓటమి వచ్చిందని అక్కడ ఆగిపోయే వాళ్లు మాత్రమే నిజమైన ఓటమిని చవి చూసినట్లు లెక్క.
గెలుపు కోసం అందరూ కృషి చేస్తారు. కానీ ఓటమి తర్వాత కూడా గెలుపు వెంట పరుగెత్తే వారే లైఫ్‌లో నిజమైన గెలుపును చూసినట్లు అర్థం. ఎందుకంటే ఓటమి అనే ఫేజ్‌ని దాటడం చాలా కష్టం. అదే కష్టం అంటే.. ఆ ఓటమి నుంచి అనుభవాలు నేర్చుకోవడం మరింత కష్టం. ఈ కష్టాలను దాటగలగిన వాడు ఏదొకరోజు జీవితంలో సక్సెస్ అవుతాడు.
కొన్ని అనుభవాల ద్వారా మనం జీవితంలో ఎదుగుతాము. ఆ అనుభవాలే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. మన కష్ట సమయాల్లో మనం నిస్సహాయంగా భావించవచ్చు. కానీ మనం వాటిని ఒక దశగా పరిగణించాలి. రాబోయే మంచి సమయాల కోసం ఎదురుచూస్తుండాలి. ఆలోపు.. మన అనుభవాలు నేర్పించే పాఠాలను తెలుసుకోవాలి. మరోసారి అలాంటి అనుభవమే ఎదురైతే.. దానిని మీరు ఎదుర్కోగలిగే శక్తి కలిగి ఉంటారు. అప్పుడే మనం ఏమి చేయగలమో మనకు తెలుస్తుంది. భరించేవాడిదే నొప్పి. కాదనడం లేదు. కానీ ఆ నొప్పిని అధిగమించడమే మీ ముందున్న గెలుపు.
ఈ కష్ట సమయాలు మన నిజమైన స్నేహితులు ఎవరో తెలియజేస్తాయి. జీవితాంతం ఉండే బంధాలను ఏర్పరచుకోవడానికి ఇదే మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని కష్టాల్లో వదిలేసి వెళ్లే వాళ్ల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మన మంచి కోరేవారు ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదలరు. మీతో కలిసి పోరాడుతారు. అలా పోరాడకుండా మిమ్మల్ని గాలికి వదిలివేసే వాళ్ల గురించి మీరు ఆలోచించకపోవడమే మంచిది. మీ కష్ట సమయంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠంలో ఇది ముఖ్యమైనది.
కాబట్టి మీరు ఓడిపోయినప్పుడు మీరు నిజంగా ఓడిపోయారని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే మీరు మీ పాఠాలను కష్టతరమైన మార్గంలో నేర్చుకున్నారు కాబట్టి. అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి. మరోసారి ఇలాంటి కష్టాలు ఎదురైతే.. మీరు మీ అనుభవాలతో ముందుకు సాగుతారు. మీ జ్ఞానంతో ఓటమిని అధిగమించి.. జీవితంలో గెలుపు వైపు అడుగు వేయండి.
సంబంధిత కథనం