Thursday Motivation : మనం ప్రతి విషయంలో, ప్రతిసారీ సక్సెస్ అవుతామా అంటే లేదు. ఎందుకంటే ఒకసారి మనం కావొచ్చు. లేదా ఇతరులు కావొచ్చు. సక్సెస్ నీకు మాత్రమే రావాలని లేదు. నీ సక్సెస్ నీకు ఎంత ముఖ్యమో.. వాళ్లకి అంతే ముఖ్యం కదా. సో మళ్లీ ట్రై చేయండి. అంతే కానీ ఓడిపోతున్నామని.. ప్రతిసారి ఓటమి తప్పదు అనుకోకండి. ప్రయత్నించడం మన కర్తవ్యం. రెస్ట్ ఈజ్ అవర్ డెస్టినీ అనుకోవాలి అంతే. ,ముందు అది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకెవరూ సపోర్ట్ లేరు, దీనిని ఎలా ముందుకు తీసుకుపోగలను అని ఆలోచించడం మానేసి.. నేను చేయగలను అనే దృక్పథంతో రోజును ప్రారంభించండి. అలా అనుకుంటే చేసేస్తామా అంటే కాదు.. మనం చేస్తామనే సంకల్పం గొప్పది అయితే.. కనీసం కాస్తో.. కూస్తో ప్రయత్నిస్తాము. నిన్నటి కంటే ఈరోజు మెరుగుపడతాము. మరీ ఓడిపోతాము అనికోవడం కన్నా.. ఇది బెటరే కదా. ,లైఫ్‌లో ఏది సాధించాలన్నా.. వాస్తవంలోకి రావాలి. విషయాలు ఎలా పనిచేస్తాయి.. మనం ఎలా వాటిని సరిచేసుకోవాలి అనే వాటిపై అవగాహన ఉండాలి. తద్వారా అన్నిరకాల పరిస్థితులను సులభంగా అంచనా వేయగలం. ముఖ్యంగా ఉదయాన్నే సానుకూలంగా ప్రారంభించాలి. మనకి మనమే గురువు. మనమే మోటివేటర్. ఉదయం లేచాక.. యస్ నేను ఇది చేయగలను. చేస్తాను. అనుకుని రోజు ప్రారంభించాలి. మనకి రోజూ ఎవరూ ఈ విషయాలు చెప్పరు కాబట్టి.. మనకి మనమే చెప్పుకోవాలి.,అందరికన్నా ముందు.. మనపై మనకు నమ్మకం ఉండాలి. అదే లేకుంటే నీలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నా.. అది వృథానే అవుతుంది. మనపై మనకు నమ్మకం ఉంటే మనలో మనకు తెలియని కొత్త సామర్థ్యాలను బయటకు తీయవచ్చు. కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ప్రయత్నాన్ని ఆపకూడదు. నిరంతర కృషి నీదైతే.. గెలుపు ఏదొకరోజు నీ ఇంటి ముందుకు వస్తుంది. ,ఏదైనా ప్రయత్నించి ఓడిపోతే.. మనలో అభద్రతా పెరిగిపోతుంది. రెండోసారి ప్రయత్నించాలంటే విసుగు, చిరాకు, నీరసం వచ్చేస్తుంది. కానీ నిన్న అలా చేశాను కదా.. ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అనే ధోరణితో ముందుకు వెళ్లిపోవాలి. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఉండకపోవచ్చు. ఆ సమయంలో మనకు అది దక్కలేదే అని బాధపడుకుండా.. మీరు ఇంకేమి చేయగలరు అనే విషయాలపై ఆలోచనను డైవర్ట్ చేయండి. ఇలా చేస్తే దాని కన్నా బెటర్ పొందుతారు. లేదా బెటర్ కాకపోయినా మీరు కష్టపడి సాధించుకుంది కాబట్టి మీకు సంతోషంగా ఉంటుంది. ,మీ ఆలోచన విధానం మారితే.. సగం గెలుపు మీ సొంతమవుతుంది. ఇది మీ పాత్రను కూడా నిర్వచిస్తుంది. ఏ అవకాశం వచ్చినా మీరు దుఃఖంలో కూరుకుపోయినట్లు కనిపించకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే చిరునవ్వుతో స్టార్ట్ చేయాలి. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, చురుకుగా ఉండండి. అది మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషపరుస్తుంది.,మీరు చేసే ప్రతి చిన్న పనిలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. నిజమైన ఆనందం భౌతిక ఆనందాలలో ఉండదు. మన మసనులో, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఇతరులతో మంచిగా ఉండండి. అది మీకు కచ్చితంగా, ఏదొక రూపంలో తిరిగి వస్తుంది. ఇతరులు నుంచి మంచి విషయాలలో ప్రేరణ పొందండి. అంకితభావం, కృషితో మీరు ఏదైనా సాధించగలరని నమ్మండి. ,