తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : వందమంది అవసరంలేదు.. ఆ ఒక్కరు మన పక్కనుంటే చాలు..

Saturday Motivation : వందమంది అవసరంలేదు.. ఆ ఒక్కరు మన పక్కనుంటే చాలు..

24 December 2022, 6:30 IST

    • Saturday Motivation : చిన్నతనంలో మనకి చాలా మంది ఫ్రెండ్స్ కావాలనిపిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్ది.. మన కోసం ఒక్కరున్నా చాలు రా అనిపిస్తుంది. సంతోషంలో మనతో ఉండేవాడే కాదు. బాధలోనూ మనకి తోడుగా ఉండే నేస్తం కోసం మాత్రమే మనసు ఎదురు చూస్తూ ఉంటుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మన లైఫ్​లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మనతో అంటే మన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఆనందంలో.. ఇలా ప్రతి దశలో తోడుండే వారే మనకి నిజమైన స్నేహితులు. మనం ఫ్రెండ్స్ అనుకునేవారందరూ అన్ని సమయాల్లోనూ మనతో ఉండాలి అనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్లు కూడా మనతో ఉండాలి అనుకోవాలిగా. కొందరు మన సంతోషంలో మాత్రమే తోడుగా ఉంటారు. మరికొందరు మనం బాధతో ఉన్నామని తెలిసి దగ్గరికి కూడా రారు. కానీ ఎవరో ఒక్కరూ లేదా ఇద్దరు మాత్రం మనతో ఎప్పుడూ ఉంటారు. దమ్ బిర్యానినే కాదు.. దరిద్రాన్ని కూడా షేర్ చేసుకుంటారు.

అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే తమ కష్టాలతో పాటు.. మీ కష్టాల్లో కూడా మీకు తోడుగా ఉంటే సహాయం చేసే మిత్రులు చాలా తక్కువమంది ఉంటారు. చిన్నప్పుడు ఏంటంటే మనం చూపించుకోవడానికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనిపిస్తుంది. కానీ పెద్దయ్యే కొద్ది స్వభావాలు మారుతాయి.. మనస్తత్వాలు మారుతాయి. ఇలాంటి సమయంలోనే ఒక్కొక్కరి నిజమైన, అసలైన రంగులు బయటపడతాయి. మనం స్కూల్​లో ఓ సర్కిల్ మెయింటైన్ చేస్తాం. కాలేజ్​కి వచ్చాక మరో సర్కిల్.. డిగ్రీలో మరో బ్యాచ్.. ఉద్యోగం చేసే చోట ఇంకెవ్వరో.. ఇలా ఎన్ని బ్యాచ్​లు మారినా.. ఒక్కరు మాత్రం మీకోసం నిజంగానే జాన్ ఇస్తారు. ఒకవేళ మీరు పొరుగురులో ఉంటే.. మీ సొంత ఊరికివెళ్లినప్పుడు మీరు కచ్చితంగా వారి దగ్గరికే వెళ్తారు. అదే నిజమైన స్నేహబంధం.

ఫ్రెండ్​షిప్​ అనే దానిని వర్ణించడానికి మాటలు సరిపోవు. కనీసం ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. నువ్వు నాకే దక్కాలి.. నాతోనే జీవితాన్ని పంచుకోవాలి అనేలా ఉంటాయి. కానీ స్నేహంలో ఇవేమి ఉండవు. పైగా మన స్నేహితులను మనం చాలా గ్రాంటెడ్​గా తీసుకుంటాము. ఎందుకంటే వాళ్లకి మనం ఏమి చేసినా.. చేయకపోయినా వాళ్లు మనతోనే ఉంటారు. అదే మనకు బలం. వారు లేనప్పుడు ఆ లోటు మనకి కచ్చితంగా తెలుస్తుంది. కష్టాల్లో మాత్రమే లోటు తెలుస్తుంది అనుకోకండి. మన సంతోషంలో కూడా వారు లేకుంటే ఆ లోటు మీకు కచ్చితంగా తెలుస్తుంది.

నిజమైన ఫ్రెండ్ ఎప్పుడూ మనకి దగ్గరగా ఉండడు. మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం తన సహాయం కోరకపోయినా.. తానే ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. మీ సక్సెస్​ని మీ కన్నా తనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. మీరు ఓడిపోతుంటే చేయినిచ్చి ఆసరా ఇస్తాడు. లేచి మీరు మళ్లీ గెలిచేలా మోటీవేట్ చేస్తాడు. మీ బాధలో, కష్టంలో మీకు తోడుగా ఉన్న వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకండి. ప్రపంచం తలక్రిందులైనా.. మీ మీద ఎంత నింద మోపబడినా.. మీ గురించి తెలిసిన స్నేహితుడు కచ్చితంగామ మీకు స్టాండ్ తీసుకుంటాడు.

తదుపరి వ్యాసం