తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : మీది మనుషుల మధ్య దూరమా? మనసుల మధ్య దూరమా?

Friday Motivation : మీది మనుషుల మధ్య దూరమా? మనసుల మధ్య దూరమా?

23 December 2022, 6:30 IST

    • Friday Motivation : ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచేది వాళ్లు ఎడబాటుగా ఉండడం కాదు. వారి మధ్యనున్న అపార్థాలే వారు దగ్గరగా ఉన్నా.. దగ్గరవ్వలేనంత దూరాన్ని పెంచుతాయి. అందుకే కొందరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్​లో ఉన్నా హ్యాపీగా ఉంటారు. మరికొందరు దగ్గరగా ఉన్నా.. దూరమైపోతుంటారు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : దూరం ఎప్పుడూ మనుషులను దూరం చేస్తుంది కానీ మనసుని కాదు. మనుషుల మధ్య దూరం తాత్కలికమే అయినా.. మనసుల మధ్య దూరం వస్తే మాత్రం అది ఎప్పటికీ దగ్గరకాదు. కాలేదు. ఒకవేళ దగ్గరైనా.. అది ఎక్కువ కాలం నిలదొక్కుకుంటుందో లేదో చెప్పలేము. ఇద్దరు మంచి వ్యక్తులు కూడా కలిసి కాపురం చేయలేకపోవచ్చు అని ఓ కవి రాసింది అక్షర సత్యం. ఇద్దరు మధ్య అపార్థాలు వస్తే.. వారు ఎంత మంచివారైనా విడిపోక తప్పదు. విపోవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు కలిసి ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. విధిని మార్చి దగ్గరైపోదామనుకోవడానికి మన జీవితం ఏమి సినిమా కాదు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

నేటి సమాజంలో విడిపోవడానికి అపార్థాలే ముఖ్య కారణం అవుతున్నాయి. మీ మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉంటే.. విడిపోయే ముందు ఓసారి ఇద్దరూ కూర్చొని చర్చించుకోండి. అపార్థాలతో ఎప్పుడూ విడిపోకూడదు. ఆలోచించి.. ఆచరణలో పెట్టి విడిపోవడంలో తప్పులేదు. అపార్థాలు అనేవి వస్తుంటాయి.. పోతుంటాయి. వాటినే ముఖ్యమైన అజెండాగా పెట్టి విడిపోవడం అనేది సరికాదు. ఇద్దరు వ్యక్తులు శారీరకంగా దగ్గరగా ఉన్నా కూడా వారి మధ్య మానసికంగా ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. కానీ వారెందుకు కలిసి ఉంటున్నారంటే.. వారికి చాలా కారణాలు ఉండే ఉంటాయి. అలాగే ఇద్దరు శారీరకంగా దగ్గరగా లేకపోయినా.. మానసికంగా దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వారి బంధం ఎలాంటిదో వారికో క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా అపార్థాలు వచ్చినా.. చక్కగా కూర్చొని చర్చించుకుని కలిసి ఉంటారు కాబట్టి.

దూరం అనేది మనుషుల మధ్య ఉంటే పర్లేదు కానీ.. హృదయాల మధ్య వస్తే మాత్రం మీరు ఆలోచించాలి. ఇవి అపార్థాల కారణంగా వస్తున్నాయా? లేదా వేరేవాటివల్ల వస్తున్నాయో తెలుసుకోండి. అపార్థాలు మీ మధ్య అలవాటుగా మారిపోయాయి అంటే మీ బంధం ఎంతో కాలం నిలబడదని అర్థం. వాటిని మీరు క్లియర్ చేసుకోకుంటే.. వడ్డీ పెరిగినట్లు పెరిగిపోతూనే ఉంటాయి. మీ బంధం కలకాలం హ్యాపీగా ఉండాలంటే.. మీ ప్రేమ అనే పొలంలో.. అపార్థం అనే కలుపు మొక్కలను వేళ్లతో సహా వెలికి తీసి అవతల పారేయండి. అప్పుడు మీ ప్రేమ జీవితంలో చక్కని అభివృద్ధిని చూస్తారు.

మీ భాగస్వామి, మీ మిత్రులు, మీ బంధువులకు మీతో దూరం పెరగకుండా ఉండాలంటే.. మీరు కచ్చితంగా అపార్థాలను క్లియర్ చేసుకోండి. తెలియకుండా జరిగే తప్పులకు శాశ్వత శిక్షలు వేయకండి. వారి స్థానంలో మీరు ఉంటే ఏమి చేస్తారో క్లియర్​గా చెప్పండి. మీరు ఎంత లేట్ చేస్తే మీ పరిస్థితి అంత చేజారిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించుకోండి.

తదుపరి వ్యాసం