తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gemini Horoscope | మిథునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

Gemini Horoscope | మిథునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 10:36 IST

google News
    • మిథునరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మిథున రాశి గురించి తెలుసుకుందాం.
మిథునరాశి ఫలితాలు
మిథునరాశి ఫలితాలు

మిథునరాశి ఫలితాలు

Ugadi Panchangam | మృగశిర - 3, 4 పాదములు, ఆరుద్ర - 1,2,3,4 పాదములు, పునర్వసు - 1,2, 3 పాదములు

* ఆదాయం - 11

* వ్యయం -5

* రాజ్యపూజ్యం - 2

* అవమానం - 2

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి దశమ స్థానమందు సంచరించుట, శని భాగ్య స్థానము, వక్రియై అష్టమ స్థానమునందు సంచరించుట, రాహువు లాభరాశియగు 11వ స్థానమందు సంచరించుట, కేతువు 5వ స్థానమునందు సంచరించుట చేత మిథునరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. ఈ రాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం గత కొంతకాలముగా ఉన్న సమస్యలను అధిగమించే ప్రయత్నములు చేసెదరు. దూర ప్రయాణములు ఉన్నాయి. శారీరక సుఖం కలుగును. కీర్తి పెరుగును. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయము నందు శని వక్రియై అష్టమ స్థానమునందు సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా చెడు ఫలితములు ఉండును. బృహస్పతి దశమంలో సంచరించుట చేత మధ్యస్థ ఫలితములు ఉండును. ఈ సంవత్సరం మిథునరాశివారికి ఉద్యోగ, వ్యాపారములందు అభివృద్ధి, కుటుంబమందు సమస్యలు, బంధువులతో ఎడబాటు, ఖర్చులు అధికముగా అవ్వడం వంటివి జరుగును. సంవత్సరపు ద్వితీయార్థం నుంచి పరిస్థితులలో కొంత మార్పు వచ్చును.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

మిథునరాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు చెడు ఫలితముగాను జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూల ఫలితములుగాను ఉన్నవి. మిధునరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం మంచిగా ఉన్నప్పటికి అదే స్థాయిలో ఖర్చులు పెరుగును. సమాజంలో కీర్తి పెరుగును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. స్త్రీలకు చెడు సమయం. ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉండును. రైతులు, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితములు ఉన్నవి. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే.. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం, బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.

మాసవారి ఫలితాలు

ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధనలాభం చేకూరును. అనారోగ్య సమస్యలు కొంత అధికముగా ఉండును. ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికి ఖర్చులు విపరీతముగా పెరుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసం. ఆలోచనల్లో మార్పులు జరుగును.

మే - ఈ మాసం నందు మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నాయి. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ధనాదాయం ఉంటుంది. వస్తు, వాహనాలు సమకూర్చుకుంటారు.

జూన్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, గృహమునందు గొడవలు. అప్పుల ఒత్తిడి పెరుగును. చేపట్టిన పనులు సకాలములో చేయుదురు.

జూలై - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. అలసటకు గురవుతారు. శారీరక రుగ్మతలు. ఆర్థిక విషయాలలో సంతోషం. దూర ప్రయాణములు అనుకూలిస్తాయి.

ఆగస్టు - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్నేహితులు, బంధువులు దూరమవుతారు. ఆరోగ్య సమస్యలు మెరుగుపడుతాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు.

సెప్టెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంతానమునకు, సోదరులకు ఇబ్బందులు. దూరప్రయాణములు. ఖర్చులు అధికము. ఆస్తి నష్టం కలుగును.

అక్టోబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శారీరక, మానసిక ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు. వస్తు లాభము కలుగును.

నవంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంతానమునకు, తల్లిదండ్రులకు చికాకులు కలుగును. చేయవలసిన పనులు పూర్తికావు. సంఘంలో గౌరవం కలుగును.

డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వరుస విజయాలతో ముందుకు వెళతారు. కుటుంబ సభ్యులతో గొడవలు రానీయకండి.

జనవరి - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబసభ్యుల సర్దుబాటు, సమస్యలు కలుగును. ప్రతి పనిలో ఆటంకము. అనవసర ప్రయాణాలు, మానసిక ఆందోళనలు కలుగును.

ఫిబ్రవరి - ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రమాదాలకు గురవుతారు. విపరీతంగా ధనం ఖర్చు అగును. గౌరవ మర్యాదలు తగ్గును. చెడు ఆలోచనలకు గురవుతారు.

మార్చి - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అధిక ధన వ్యయం, అనవసర ప్రయాణాలు, మానసిక అశాంతికి గురవుతారు. పనులన్నీ నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం