తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer Horoscope | కర్కాటకరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

Cancer Horoscope | కర్కాటకరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 11:47 IST

google News
    • కర్కాటకరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా కర్కాటకరాశి రాశి గురించి తెలుసుకుందాం.
కర్కాటకరాశి ఫలితములు
కర్కాటకరాశి ఫలితములు

కర్కాటకరాశి ఫలితములు

Ugadi Panchangam | పునర్వసు - 4 పాదము, పుష్యమి - 1,2,3, 4 పాదములు, ఆశ్లేష -1, 2, 3 , 4 పాదములు

* ఆదాయం - 5

* వ్యయం - 5

* రాజ్యపూజ్యం - 5

* అవమానం - 2

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి భాగ్య స్థానమందు సంచరించుట, శని అష్టమ స్థానము, వక్రియై సప్తమ స్థానమునందు సంచరించుట, రాహువు రాజ్యస్థానమగు 10వ స్థానమునందు సంచరించుట, కేతులు 4వ స్థానమునందు సంచరించుటచేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుంచి చెడు ఫలితములు ఉన్నవి. కర్కాటక రాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ ఉద్యోగములో అభివృద్ధి, ధనలాభము కలుగును. దూర ప్రయాణములు చేస్తారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రియై సప్తమ స్థానమునందు సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా చెడు ఫలితములు ఉండును. బృహస్పతి భాగ్యములో సంచరించుట చేత అనుకూలమైన ఫలితములు ఉండును. ఈ సంవత్సరం కర్కాటకరాశి వారికి ఉద్యోగ, వ్యాపారములందు మధ్యస్థ ఫలితములు, కుటుంబమునందు సమస్యలు, బంధుమిత్రులతో విభేదాలు, ధనవ్యయం అధికముగా అవ్వడం వంటివి జరుగును. కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యమునకు సంబంధించిన విషయముల యందు, ఆర్థిక విషయములకు వాటికి సంబంధించిన వాటికి, కుటుంబ విషయముల యందు జాగ్రత్త వహించవలెను.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

కర్కాటక రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ ఫలితముగాను జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య చెడు ఫలితములుగాను ఉన్నవి. కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం మంచిగా ఉన్నపప్పటికి అదే స్థాయిలో ఖర్చులు పెరుగును. ఈ సంవత్సరం కర్కాటక రాశివారికి కుటుంబమునందు అనారోగ్యము, కలహములు అధికముగా ఉన్నవి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ నుంచి చెడు ఫలితములు ఉన్నవి. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. స్త్రీలకు అనుకూలంగా లేనటువంటి సమయం. ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉండును. రైతులు, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు సైతం అనుకూలంగా లేదు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించాలి. సోమవారం శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవాలి. గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రమాదములు జరుగు సూచనలు, గొడవలు, మానసిక ఆందోళన అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అధికారుతో భేదాభిప్రాయం ఏర్పడును. భార్యభర్తల మధ్య విభేదములు ఏర్పడును.

మే - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య సమస్యలు, మీరు తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికముగా బాగుండును.

జూన్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నతి. పితృవర్గానికి చెడు జరుగును.

జూలై - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. దూర ప్రయణాలు, అనవసర ఖర్చులు, మానసిక అశాంతి, సకాలంలో పనులు పూర్తి చేయుదురు.

ఆగస్టు - ఈ మాసం మీకు కలసి రాదు. సోదరులతో, స్నేహితులతో విరోధములు, అనవసర గొడవలు. మంచితనంతో ఉంటారు.

సెప్టెంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయం అంతంతం మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను.

అక్టోబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. సోదరులకు, సంతానమునకు చెడు కాలము. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో ముుందడుగు వేస్తారు. ప్రతి విషయంలో మంచి ఫలితాలు వస్తాయి.

నవంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మానసిక అశాంతి, శారీరకంగా అలసట. వస్తు, వస్త్ర, గృహ లాభములు పొందుదురు. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మీకు మంచి గుర్తింపు వస్తుంది.

డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. తల్లిదండ్రులకు చెడు కాలము. బంధుమిత్రులు సహకరించరు. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఉన్నతస్థాయికి ఎదుగుతారు.

జనవరి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి స్థితి పొందుతారు. వస్తు, వస్త్ర, వాహన లాభములు కలుగును.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చేసే పనుల్లో చెడు అనుభవాలు ఎదురౌతాయి. ఆరోగ్య సమస్యలుండను. చుట్టుపక్కలవారితో గొడవలు.

మార్చి - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాలు అనుకూలించును. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. అనవసర గొడవలు, ఇతరులతో విరోధములు కలుగును.

 

టాపిక్

తదుపరి వ్యాసం