తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Republic Day Wishes Telugu: మీ స్నేహితులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇలా తెలుగులోనే చెప్పండి

Republic day wishes Telugu: మీ స్నేహితులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇలా తెలుగులోనే చెప్పండి

Haritha Chappa HT Telugu

25 January 2024, 16:00 IST

    • Republic day wishes Telugu: గణతంత్ర దినోత్సవ వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలవబోతున్నాయి. వేడుకలకు మన దేశం సిద్ధమైంది.
రిపబ్లిక్ డే విషెస్
రిపబ్లిక్ డే విషెస్

రిపబ్లిక్ డే విషెస్

Republic day wishes Telugu: మరి కొన్ని గంటల్లో ఊరూ వాడా మువ్వన్నెల జెండా ఎగరబోతోంది. భారతదేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. 1950 జనవరి 26 నుంచి భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆరోజు నుంచి రిపబ్లిక్ డే నాడు ప్రతి చోట సగౌరవంగా మువ్వన్నల జెండాను ఎగరవేస్తూ ఉంటాము. ఈ దేశ పౌరులుగా ఒకరికొకరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. రిపబ్లిక్ డే విషెస్ ను తెలుగులోనే మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి. Happy Republic Day 2024 Wishes, Republic Greetings Telugu, Republic Day Quotes ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు షేర్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

రిపబ్లిక్ డే విషెస్

1. మన దేశం గర్వించే రోజు ఇది.

దేశం గణతంత్ర రాజ్యాంగంగా మారిన క్షణం ఇది.

ఈరోజును అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే

హ్యాపీ రిపబ్లిక్ డే

2. మన దేశం ప్రత్యేకత... ఏకత్వం, భిన్నత్వం, స్వేచ్ఛ

ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుందాం.

హ్యాపీ రిపబ్లిక్ డే

republic day wishes

3. ఈ ప్రత్యేకమైన రోజున స్వాతంత్య్రం కోసం

ప్రాణ త్యాగం చేసిన వీరులను స్మరించుకుందాం

మన దేశాన్ని గొప్పగా మార్చే విలువలను నేర్చుకుందాం.

జైహింద్ హ్యాపీ రిపబ్లిక్ డే

4. మన రాజ్యాంగం మనకు అందించిన

న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని గౌరవిద్దాం.

ఆ నియమాలను గౌరవంగా పాటిద్దాం.

హ్యాపీ రిపబ్లిక్ డే

5. నాతోటి భారతీయ పౌరులందరికీ

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మన దేశం ప్రజాస్వామ్యం, ప్రగతికి దీపంలా ప్రకాశించాలని కోరుకుందాం.

హ్యాపీ గణతంత్ర దినోత్సవం

6. మన దేశపు బంగారు వారసత్వాన్ని స్మరించుకుందాం.

భారతదేశంలో భాగమైనందుకు గర్విద్దాం

హ్యాపీ రిపబ్లిక్ డే

republic day wishes

7. మన త్రివర్ణ పతాకంలో ఉన్న రంగులు

మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని

నింపాలని కోరుకుంటున్నాం.

ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే

8. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నప్పుడు

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుందాం.

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

9. మన హృదయం దేశభక్తితో నిండిపోవాలి

ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

10. వివిధ సంస్కృతులను అందంగా ఒకే చోట

అల్లిన వైవిధ్యభరితమైన భూమి... భారతదేశం

హ్యాపీ రిపబ్లిక్ డే

11. మన దేశ గొప్పతనం, బలం, ఐక్యతకు

ప్రతీకగా త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉండాలి

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

republic day wishes

12. గణతంత్ర దినోత్సవం రోజున మనకు రాజ్యాంగాన్ని

రూపొందించిన దార్శనికులను,

ఆ రాజ్యాంగాన్ని రక్షిస్తున్న ధైర్య హృదయాలను స్మరించుకుందాం.

వారిని మెచ్చుకుందాం.

హ్యాపీ రిపబ్లిక్ డే

13. ఈ గణతంత్ర దినోత్సవం రోజున

మన స్వాతంత్య్రాన్ని గౌరవిద్దాం.

మన దేశానికి శాంతి, శ్రేయస్సు మరింతగా

అందించేందుకు కృషి చేద్దాం

హ్యాపీ రిపబ్లిక్ డే

14. మన స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని

పుణికి పుచ్చుకొని, మన ప్రియమైన దేశం పురోగతికి

తోడ్పడుతామని... అందరం ప్రతిజ్ఞ చేద్దాం.

హ్యాపీ రిపబ్లిక్ డే

15. మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం

అసువులు బాసిన సమరయోధుల దీక్షాదక్షతలను స్మరిస్తూ

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

16. దేశం పై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం

మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని

మేము కోరుకుంటున్నాం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

17. నేటి గణతంత్ర దినోత్సవం

ఎందరో త్యాగ వీరులా త్యాగఫలం

హ్యాపీ రిపబ్లిక్ డే

టాపిక్

తదుపరి వ్యాసం