Republic day 2024 : 'రిపబ్లిక్ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
Republic day 2024 : రిపబ్లిక్ డేని జనవరి 26వ తేదీనే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న చరిత్ర మీకు తెలుసా?
Republic day 2024 : 75ఏవ రిపబ్లిక్ డే కోసం భారత దేశం సిద్ధమవుతోంది. దిల్లీ వీధుల్లో ఇప్పటికే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. రిపబ్లిక్ డే ని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? జనవరి 26న, భారత రాజ్యంగం అమల్లోకి రావడంతో రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. కానీ.. జనవరి 26నే ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ తెలుసుకుందాము రండి..
గణతంత్ర్య దినోత్సవం.. జనవరి 26 చరిత్ర..
1947 ఆగస్ట్ 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని అప్పటికే చాలా మంది పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించేందుకు.. ఆగస్ట్ నెల చివర్లో.. బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఈ కమిటీ ఎంతో కృషి చేసింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. చివరికి.. 1949 నవంబర్ 26న.. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అందుకే.. ఆరోజును ప్రతియేట.. 'రాజ్యాంగ దినోత్సవం'గా గుర్తు చేసుకుంటాము.
Why is republic day celebrated on January 26 : 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నారు కానీ.. దానిని అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేద్దాము? అని ఆలోచిస్తుండగా.. అప్పటి రాజకీయ పెద్దలకు తట్టిన తేదీ.. 'జనవరి 26'. ఇందుకు ఓ ముఖ్య కారణం కూడా ఉంది.
అది 1930.. బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) తీవ్రంగా పోరాడుతున్న రోజులవి. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్. దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు.
అందుకే.. 20ఏళ్ల తర్వాత.. అంటే, జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అలా.. 1950, జనవరి 26వ తేదీన.. భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇండియా.. రిపబ్లిక్ నేషన్‌గా అవతరించింది. ఇండియా.. సావరిన్, డెమొక్రటీక్, రిపబ్లిక్ నేషన్‌గా మారింది.
అట్టహాసంగా సంబరాలు..
Republic ay 2024 latest news : అప్పటి నుంచి ప్రతియేటా గణతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఊరూ, వాడ.. అందరు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. పంద్రాగస్టు తర్వాత.. దేశంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్స్‌లో ఈ గణతంత్ర్య దినోత్సవం ఒకటి.
దిల్లీలో కోలాహలం వర్ణణాతీతంగా ఉంటుంది. గణతంత్ర్య దినోత్సవం రోజు.. భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం.. రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత.. ధైర్యసాహాసలు కనబర్చి, ప్రత్యేకంగా నిలిచిన వారికి అవార్డులు ఇస్తారు.
సంబంధిత కథనం