Republic day 2024: రిపబ్లిక్ డే పరేడ్ ఎన్ని కిలోమీటర్లు పాటు సాగుతుందో తెలుసా? ఆసక్తికరమైన విషయాలు ఇదిగో
26 January 2024, 7:00 IST
- Republic day 2024: గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయంటే... మన దేశం మువ్వన్నల రంగులతో ముచ్చటగా సిద్ధం అయిపోతుంది.
రిపబ్లిక్ డే పరేడ్
Republic day 2024: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీ మువ్వన్నెల రంగులతో నిండిపోతుంది. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ లో జెండాను ఎగురవేసి పరేడ్ నిర్వహిస్తారు. ఈ రిపబ్లిక్ డే పరేడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దీన్ని చూసేందుకు రెండు లక్షల మందికి పైగా వీక్షకులు వస్తారు. ఈ రోజున భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పరేడ్ లో మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, సైనిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. ఈ పరేడ్ చూసేందుకు కన్నుల పండువలా ఉంటుంది.
1950 జనవరి 26న మనదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆ రోజు నుంచి మన దేశాన్ని గణతంత్ర రాజ్యాంగా ప్రకటించారు. మొదటిసారి గణతంత్ర దినోత్సవాన్ని అదే రోజు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా మనం నిర్వహించుకుంటున్నాం. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన శకటాలు కవాతు నిర్వహిస్తాయి. పరేడ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1. 1950 నుండి 1954 వరకు రిపబ్లిక్ డే పర్యటనను ప్రస్తుతం నిర్వహిస్తున్న రాజపథ్ లో నిర్వహించలేదు. ప్రస్తుతం నేషనల్ స్టేడియం గా పిలుచుకుంటున్న ఇర్విన్ స్టేడియంలో మొదటిసారి నిర్వహించారు. తరువాత కింగ్స్ వే, ఎర్రకోట, రామ్ లీల మైదాన్ లో వరుసగా నిర్వహించారు. 1955 జనవరి 26 నుంచి ఈ పరేడ్ కు రాజపథ్ శాశ్వత వేదికగా మారింది. దీన్ని ఇప్పుడు కర్తవ్యాపథ్ అని పిలుస్తున్నారు.
2. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు ఏదైనా దేశానికి చెందిన ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్‌ను అతిథిగా ఆహ్వానిస్తారు. మొదటిసారి 1950లో ఈ కవాతు జరిగినప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడిని అతిథిగా ఆహ్వానించారు. పాకిస్తాన్ గవర్నర్ ను కూడా 1955లో ఈ పరేడ్ కు ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు.
3. ఈ పరేడ్ రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరవ్వడంతో ప్రారంభమవుతుంది. జాతీయ గీతాన్ని ప్లే చేసి 21 గన్స్ తో సెల్యూట్ చేస్తారు.
4. ఈ పరేడ్లో పాల్గొనే వారందరూ తెల్లవారుజామున రెండు గంటలకే సిద్ధంగా ఉంటారు. మూడు గంటలకు రాజ్ పథ్‌కు చేరుకుంటారు. వీరంతా ఈ పరేడ్లో పాల్గొనడానికి 600 గంటల పాటు ప్రాక్టీస్ చేశారు.
5. ఈ పరేడ్లో భారతదేశం తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. ట్యాంకులు, సాయుధ వాహనాలు కవాతులో పాల్గొంటాయి. వీటిని ముందుగానే ఇండియా గేట్ దగ్గరకు తీసుకొచ్చి ఒక ప్రత్యేక శిబిరంలో ఉంచుతారు.
6. జనవరి 26న జరిగే కవాతులో పాల్గొనేవారు ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. ప్రతిరోజూ ఈ రాజపథ్ మార్గంలోనే ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ లో భాగంగా ప్రతిరోజూ 12 కిలోమీటర్ల దూరం చేస్తారు. కానీ జనవరి 26న జరిగే కవాతులో మాత్రం తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే కవర్ చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది పరేడ్ లో కూర్చుని ఉంటారు. కాబట్టి వారికి స్థలం సరిపోదు. అందుకే 9 కిలోమీటర్లతోనే ముగిస్తారు.
7. కవాతులో పాల్గొన్న శకటాలన్నీ గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి అందరూ వీటిని కుణ్నంగా చూడవచ్చు.
8. అత్యంత ఆకర్షణీయమైనది ప్లై పాస్ట్. ఎయిర్ ఫోర్స్ దళాలు దీన్ని నిర్వహిస్తాయి. 41 ఎయిర్ క్రాఫ్ట్ లు ఆకాశంలో ఎగురుతూ మువ్వన్నెల జెండాలను రంగులు చల్లి ఆవిష్కరిస్తాయి.
9. కవాతును ఏర్పాటు చేయడానికి 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయిందని ఒక అంచనా. 2014లో ఇదే పర్యటనలు నిర్వహించారు. అప్పుడు 320 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ఆర్టిఐ ద్వారా తెలిసింది. ఇప్పుడు అంతకుమించి అయ్యే అవకాశం ఉంటుంది.
టాపిక్