తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme Ac ధర రూ. 27 వేలు.. 55 డిగ్రీల మండుటెండలోనూ మీ గది అవుతుంది ఇక హిమాలయం!

Realme AC ధర రూ. 27 వేలు.. 55 డిగ్రీల మండుటెండలోనూ మీ గది అవుతుంది ఇక హిమాలయం!

HT Telugu Desk HT Telugu

14 April 2022, 19:05 IST

    • Realme తాజాగా ఎయిర్ కండీషనర్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఏసిలు రూ. 30 బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. 
Realme AC
Realme AC (Realme tech life )

Realme AC

స్మార్ట్ గాడ్జెట్‌లను ఉత్పత్తి చేసే రియల్‌మి సంస్థ ఇప్పుడు AC విభాగంలోనూ ప్రవేశించింది. ఇండియాలో వేసవి పరిస్థితులను దృష్టిలో ఎయిర్ కండీషనర్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

Realme TechLife తాజాగా కన్వర్టిబుల్ ఎయిర్ కండీషనర్‌లను Flipkart ద్వారా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఏసిలు రూ. 30 బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఇందులో ఆటో క్లీనింగ్, బ్లూ ఫిన్ టెక్నాలజీ లాంటి మెరుగైమ ఫీచర్లు ఉన్నాయి. ఆటో క్లీనింగ్ ఫీచర్‌ ఏసిలో తేమ, దుమ్ము, బూజు చేరకుండా నివారిస్తుంది. బ్లూ ఫిన్ సాంకేతికత నీటి బిందువులు, ఉప్పు, యాసిడ్ నిక్షేపణల నుంచి కాయిల్స్‌కు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Realme ACలలో డ్రై, ఎకో ఇంకా స్లీప్ అనే మూడు కూలింగ్ మోడ్‌లు ఉన్నాయి. బయట 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా గదిని వేగంగా చల్లబరచగలదని కంపెనీ పేర్కొంది.

అలాగే గదిలోని వ్యక్తులకు తగినట్లుగా కూడా ఏసి చల్లదనాన్ని సర్దుబాటు చేసుకోగలిగే వివిధ సెట్టింగ్స్ కూడా ఈ ఏసిలో ఉన్నాయి.

ఒకరికోసం Me టైమ్ మోడ్ - 0.9 టన్, ఇద్దరి కోసం We టైమ్ మోడ్ - 1.1 టన్, నలుగురికోసం ఫ్యామిలీ టైమ్ మోడ్ - 1.3 టన్ అలాగే కొద్దిమంది కోసం పార్టీ టైమ్ మోడ్ అని ఆప్షన్స్ ఇచ్చారు.

ఈ AC లోపల ఎక్కువకాలం నిలిచిఉండే రాగి కాయిల్‌ కలిగిన వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్ ఉంది. ఇది తక్కువ విద్యుత్ వినియోగించి, వేగవంతమైన శీతలీకరణగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ సరికొత్త Realme AC.. 4 స్టార్ ఇంకా 5 స్టార్ రేటింగ్స్‌లలో లభిస్తున్నాయి. రేటింగ్స్‌ను బట్టి రేట్లు ఉన్నాయి. బేసిక్ మోడెల్ 4 స్టార్ రేటింగ్ కలిగిన ఏసి ధరలు రూ. 27,790 నుంచి 30,999 వరకు ఉంటే.. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసి వేరియంట్ ధర రూ. 33,490/- గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం