తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Poori Recipe: మధుమేహుల కోసం రాగి పూరి రెసిపీ, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు

Ragi Poori Recipe: మధుమేహుల కోసం రాగి పూరి రెసిపీ, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు

Haritha Chappa HT Telugu

31 January 2024, 6:00 IST

google News
    • Ragi Poori Recipe: డయాబెటిస్ పేషెంట్లకు రాగి వంటకాలు మేలు చేస్తయి. రాగి పూరీలను ఒకసారి ప్రయత్నించండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరతో తిన్నా ఇవి రుచిగానే ఉంటాయి.
రాగి పూరీ రెసిపీలు
రాగి పూరీ రెసిపీలు (Prathy's Samayal/ youtube)

రాగి పూరీ రెసిపీలు

Ragi Poori Recipe: రాగి పిండితో చేసిన ఆహారాలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా రాగిలోని పోషకాలు అడ్డుకుంటాయి. ప్రతిరోజు రాగిజావని తాగితే ఎంతో మంచిదని వైద్యులు చెబుతూనే ఉంటారు. డయాబెటిస్‌ను అదుపులో పెట్టే శక్తి రాగులకు ఉంది. మీరు మైదాతో చేసిన పూరీలను తినకూడదు. అందుకే ఒకసారి రాగులతో చేసిన పూరీని ప్రయత్నించండి. దీన్ని ఏ కర్రీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. వీటిని చేయడం చాలా సులువు. రాగి పూరీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

రాగి పూరీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - ఒక కప్పు

గోధుమపిండి - మూడు స్పూన్లు

నువ్వులు - ఒక స్పూను

బంగాళదుంప - ఒకటి

కారం - అర స్పూను

నూనె - తగినంత

ఇంగువ - చిటికెడు

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపడినన్ని

రాగి పూరి రెసిపీ

1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి మెత్తగా చేత్తోనే మెదుపుకోవాలి.

2. ఒక గిన్నెలో ఆ బంగాళదుంపల పేస్టును వెయ్యాలి.

3. అందులోనే రాగి పిండిని కలపాలి. అలాగే ముప్పావు కప్పు గోధుమపిండిని జోడించాలి.

4. ఆ మిశ్రమంలో కారం, ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి.

5. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

6. ఇప్పుడు గోరువెచ్చని నీటిని వేసి ఈ పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి.

7. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో ఒత్తుకోవాలి.

8. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.

9. వేడెక్కిన ఆ నీటిలో ఈ రాగి పూరీలను వేసి వేయించాలి.

10. రెండు వైపులా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

11. టిష్యూ పేపర్ పై ఈ రాగి పూరీలను వేసి ఒత్తితే ఆ నూనె పీల్చేసుకుంటుంది.

12. రాగి పూరీలను ఏ కూరతో తిన్నా టేస్టీ గానే ఉంటాయి. చికెన్ కర్రీతో తింటే ఇంకా రుచిగా ఉంటాయి. ఎగ్ బుర్జీతో కూడా ఇది మంచి జతగా ఉంటాయి.

రాగి పిండితో చేసిన ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. దీనిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే గ్లూటెన్ ఉండదు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు కచ్చితంగా రాగితో చేసిన ఆహారాలను తినమని సిఫార్సు చేస్తారు వైద్యులు. అలాగే జీర్ణ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎవరైతే ప్రతిరోజూ రాగి పిండితో చేసిన ఆహారాలను తింటారో, వారు మధుమేహం వచ్చే అవకాశాన్ని తగ్గించుకుంటారు. ఇప్పటికే మధుమేహం బారిన పడినవారు దాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజూ రాగి పిండితో చేసిన ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే రాగి పిండితో చేసిన ఆహారాలను ఎక్కువగా ఉదయం సమయంలో తింటేనే మంచిది. రాత్రిపూట తినడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ రాగి పూరీలను ఒకసారి మీరు ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. కచ్చితంగా మీకు నచ్చుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం