తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rava Toast Breakfast | బాంబే రవ్వతో టోస్ట్.. వారె వాహ్ అనిపించే టేస్ట్, ఇది సరైన బ్రేక్‌ఫాస్ట్!

Rava Toast Breakfast | బాంబే రవ్వతో టోస్ట్.. వారె వాహ్ అనిపించే టేస్ట్, ఇది సరైన బ్రేక్‌ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu

20 October 2022, 7:59 IST

google News
    • బ్రెడ్ లేకపోయినా బాంబే రవ్వతో టోస్ట్ చేసుకోవచ్చు, బ్రెడ్ కలిపి కూడా మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. రెండు విధానాల్లో ఎలా చేసుకోవాలో Rava Toast Recipe ఇక్కడ ఉంది చూడండి.
Rava Toast Recipe
Rava Toast Recipe (Slurrp)

Rava Toast Recipe

ఈ ఉదయం రుచికరంగా, పోషకభరితమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే రవ్వ టోస్ట్ ప్రయత్నించండి. టోస్ట్ అనగానే బ్రెడ్ కావాలనుకుంటున్నారేమో. బ్రెడ్ లేకపోయినా, రవ్వతోనే క్రిస్పీగా టోస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ టోస్టులో మీకు క్యాప్సికమ్, టొమాటో, క్యారెట్ ముక్కలు వేసుకొని తింటే మీరు ఇదివరకు ఎన్నడూ చూడని రుచిని ఆస్వాదించగలుగుతారు.

అలాగే దీనిని బ్రెడ్‌తో కలిపి కూడా చేసుకోవచ్చు. దాని రుచికూడా మరోరకంగా ఉంటుంది. మీకు ఇక్కడ రెండు విధానాల్లో రవ్వ టోస్ట్ ఎలా చేయాలో తెలియజేస్తున్నాం. ఈ టోస్ట్ తయారు చేయటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు, ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కేవలం 10-15 నిమిషాల్లోనే మీరు ఈ రవ్వ టోస్ట్ సిద్ధం చేసుకోవచ్చు.

మరి ఆలస్యం దేనికి, త్వరగా రవ్వ టోస్ట్ తయారు చేయటానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం తెలుసుకోండి.

Rava Toast Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 1 కప్పు బాంబే రవ్వ
  • 1/2 కప్పు పెరుగు
  • 1/4 కప్పు నీరు
  • 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
  • 1/2 కప్పు తరిగిన టమోటా
  • 1/2 కప్పు తరిగిన క్యారెట్
  • 1/2 కప్పు తరిగిన క్యాప్సికమ్
  • 1/2 టేబుల్ స్పూన్ కారం
  • 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి
  • 2 టీస్పూన్ వెన్న
  • రుచికి తగినంత ఉప్పు

రవ్వ టోస్ట్ తయారు చేసుకునే విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, కొన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి అన్నీ కలిపి రవ్వ బ్యాటర్ చేసుకోవాలి.
  2. మరోవైపు పాన్‌లో వెన్న లేదా నూనె వేసి తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి.
  3. ఆపై ఉప్పు, కారం, మిరియాలపొడి చల్లి అన్ని కలిసిపోయేలా కలుపుతూ వేయించుకోవాలి.
  4. ఆ తర్వాత మరొక పాన్‌లో సగం రవ్వ బ్యాటర్ వేసి, ఆ తర్వాత వెజిటెబుల్ మిక్స్ వేసి, మళ్లీ పైనుంచి మిగతా సగం రవ్వ బ్యాటర్ వేసి ఉడికించాలి.
  5. ఉడికిన తర్వాత, రవ్వ టోస్ట్ రెడీ అవుతుంది. దీనిని చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేసుకొని తినవచ్చు.

మరొక విధానం

  1. ఇక్కడ కూడా పైన పేర్కొన్న విధంగా రవ్వ బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి. మెత్తబడేలా ఒక 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి.
  2. అదే విధంగా వెజిటెబుల్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పాన్‌లో వెన్న వేసి వేడి చేసుకోవాలి, ఆపై బ్రెడ్ ముక్కలకు గ్రీన్ చట్నీ పూసి వెన్నలో రోస్ట్ చేసి టోస్ట్ చేయాలి.
  4. ఇప్పిడు మరొకసారి బ్రెడ్ ముక్కలకు వెన్నరాసి, రవ్వ బ్యాటర్ కూడా అద్దించి, ఆపై రంగు మారేంత వరకు టోస్ట్ చేయాలి.

అంతే రవ్వ బ్రెడ్ టోస్ట్ రెడీ అయినట్లే, ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం