తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walnut Oil Benefits : వాల్​నట్ ఆయిల్​తో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె నుంచి మధుమేహం వరకు..

Walnut Oil Benefits : వాల్​నట్ ఆయిల్​తో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె నుంచి మధుమేహం వరకు..

13 January 2023, 14:58 IST

    • Walnut Oil Benefits : వాల్‌నట్స్ గురించి ఎక్కువమందికి తెలుసుకానీ.. వాల్‌నట్ ఆయిల్ గురించి తెలియకపోవచ్చు. అయితే వాల్‌నట్స్ కన్నా.. దాని ఆయిల్​తోనే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. గుండె జబ్బులు నుంచి.. మధుమేహం, క్యాన్సర్ వరకు ఇది గొప్ప ఫలితాలు ఇస్తుంది అంటున్నారు.
వాల్ నట్ హెల్త్ బెనిఫిట్స్
వాల్ నట్ హెల్త్ బెనిఫిట్స్

వాల్ నట్ హెల్త్ బెనిఫిట్స్

Walnut Oil Health Benefits : వాల్‌నట్ ఆయిల్ దానిలోని సుగుణాలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాల్‌నట్ నూనె వగరు రుచిని కలిగి ఉన్నా.. అది ఆరోగ్యకరమైనదిగా చెప్తారు. ఇది పాలీఫెనాల్స్, విటమిన్లు ఇ, కె, కోలిన్, ఫాస్ఫరస్, జింక్‌తో సహా అనేక పోషకాలు, సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది తినడానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే దీని వల్ల కలిగే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

చర్మ ఆరోగ్యానికై..

వాల్‌నట్ ఆయిల్‌లో ఉండే కొవ్వు ఆమ్లాలు మానవ చర్మాన్ని తయారు చేసే సమ్మేళనాలుగా మారుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతే కాదు ఇది వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేసే.. యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

అదనంగా మీరు సోరియాసిస్‌తో ఇబ్బంది పడుతుంటే.. వాల్‌నట్ ఆయిల్‌ని అప్లై చేయడం వల్ల మీ లక్షణాలను తగ్గించుకోవచ్చు. మీరు దానితో మొటిమలు, తామరకు కూడా చికిత్స చేయవచ్చు.

మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

అనామ్లజనకాలు పుష్కలంగా కలిగిన వాల్‌నట్ నూనె రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం వచ్చే అవకాశాలను మరింత తగ్గిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 100 మంది వ్యక్తులపై చేసిన ఒక అధ్యయనంలో.. మూడు నెలల పాటు ఒక టేబుల్ స్పూన్ వాల్‌నట్ ఆయిల్ తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. వాస్తవానికి ఇది వారి హిమోగ్లోబిన్ A1c స్థాయిలను కూడా తగ్గించింది. ఇది దీర్ఘకాలిక రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికై..

ఇతర సమ్మేళనాలతో పాటు.. వాల్‌నట్ నూనె ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మంచితనంతో కూడా నిండి ఉంది. ఇది "మంచి కొవ్వు", ఇది ప్రతిరోజూ తినేటప్పుడు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని 10% తగ్గిస్తుంది.

వాల్‌నట్ ఆయిల్ రక్తపోటు స్థాయిలను సాధారణ పరిధిలో ఉంచడంలో సహాయపడుతుందని.. తద్వారా మెరుగైన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని నిర్వహించిన ఒక అధ్యయనం కనుగొంది.

క్యాన్సర్‌ను నివారిస్తుంది

వాల్‌నట్ ఆయిల్‌లో ఒక నిర్దిష్ట సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను వ్యతిరేకిస్తుంది. నిజానికి వాల్‌నట్‌లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను ఎదుర్కొనే అవకాశాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది అనేక టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలలో నిర్ధారించబడింది.

అదనంగా వాల్‌నట్ ఆయిల్‌లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌కు దారితీసే కణాల నష్టంతో పోరాడుతాయి.

జుట్టుకు మంచిది

వాల్‌నట్ ఆయిల్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లే దీనికి సహాయం చేస్తాయి. అంతే కాదు ఇది చుండ్రు, స్కాల్ప్ ఇరిటేషన్, డ్రైనెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది శీతాకాలంలో ఉపయోగించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.

ఇంకేముంది? ఇందులోని పొటాషియం కణాల పునరుత్పత్తికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.

తదుపరి వ్యాసం