Premature Ejaculation: శ్రీఘ్ర స్కలనం సమస్యకు 9 పరిష్కార మార్గాలు ఇవే
16 November 2023, 21:00 IST
- శ్రీఘ్రస్కలన (Premature Ejaculation) సమస్యకు కొన్ని చిట్కాలతో పరిష్కారం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
శ్రీఘ్ర స్కలన సమస్యకు 9 పరిష్కార మార్గాలు
శీఘ్ర స్కలనం (PE) సమస్యను పురుషులు తరచుగా లేదా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటారు. ఇదొక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి పలు పరిష్కారాలు ఉన్నాయి.
కెగెల్ వ్యాయామాలు
ఈ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. కెగెల్ వ్యాయామాలు చేయడానికి, మూత్ర ప్రవాహాన్ని ఆపడానికి మీరు ఉపయోగించే కండరాలను బిగపట్టండి. కొన్ని సెకన్ల తరువాత సడలించండి. రోజులో చాలా సార్లు ఇలా రిపీట్ చేయండి.
స్టార్ట్-స్టాప్ టెక్నిక్
లైంగిక కార్యకలాపాల సమయంలో స్టార్ట్-స్టాప్ టెక్నిక్‌ని ప్రయత్నించండి. మీరు స్కలనం చేయబోతున్నారని మీకు అనిపించినప్పుడు అన్ని లైంగిక కార్యకలాపాలను ఆపండి. కొన్ని క్షణాల్లో మీరు స్కలన ఉద్రికత్తను కోల్పోతారు. ఇలా చేయడం వల్ల మీ ఉద్రేకంపై మెరుగైన నియంత్రణను పొందుతారు.
పాజ్-స్క్వీజ్ టెక్నిక్
స్టార్ట్-స్టాప్ టెక్నిక్ మాదిరిగానే, మీరు స్కలనం చేయబోతున్నారని మీకు అనిపించినప్పుడు పురుషాంగం చివరలో సుమారు 30 సెకన్ల పాటు స్క్వీజ్ (నొక్కిపట్టడం) చేయండి. ఇది స్కలనం ఆలస్యం కావడానికి సహాయపడుతుంది.
ఫోర్‌ప్లేపై దృష్టి పెట్టండి
ఫోర్‌ప్లే ఎక్కువ సేపు చేయడం వల్ల సంభోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మీతోపాటు మీ భాగస్వామి కూడా రిలాక్స్ అవుతారు. స్త్రీలు భావప్రాప్తి పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఫోర్‌ప్లే వల్ల మీరూ, మీ భాగస్వామి ఒకేసారి భావప్రాప్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
మందమైన కండోమ్‌లు
మందంగా ఉండే కండోమ్‌లు మీ పురుషాంగపు సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. ఇవి స్ఖలనం ఆలస్యం చేయడంలో సహాయపడవచ్చు.
విభిన్న స్థానాలను ప్రయత్నించండి
కొన్ని లైంగిక స్థానాలు, భంగిమలు, ఆలోచనలు తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అవి స్ఖలనం ఆలస్యం చేయడంలో సహాయపడవచ్చు. మీకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనడానికి ప్రయత్నించండి.
మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి
డీప్ బ్రీత్, ధ్యానం వంటి పద్ధతులు మీరు ఈ క్షణంలో ఉండేందుకు, ఆందోళనను తగ్గించేందుకు, పర్ఫామెన్స్ యాంగ్జైటీని తగ్గించేందుకు సహాయపడతాయి, ఇది అకాల స్ఖలనానికి దోహదం చేస్తుంది.
మీ భాగస్వామితో కమ్యూనికేషన్
మీ ఆందోళనలు, భావాల గురించి మీ భాగస్వామితో బహిరంగంగా కమ్యూనికేట్ చేయడం వల్ల మీ ఆందోళనను తగ్గుతుంది. మీ లైంగిక సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వైద్య సలహా
శ్రీఘ్ర స్ఖలనం అనేది నిరంతర సమస్యగా వేధిస్తుంటే మీరు వైద్య నిపుణులను సంప్రదించడం గురించి ఆలోచించండి. వారు తగిన గైడెన్స్ అందించగలరు. విభిన్న పద్ధతులు, మందులు లేదా కౌన్సెలింగ్ వంటి చికిత్సలను సిఫారసు చేయవచ్చు.