తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు ఏ రంగు ద్రాక్ష తింటే ఆరోగ్యానికి మంచిది?

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు ఏ రంగు ద్రాక్ష తింటే ఆరోగ్యానికి మంచిది?

Anand Sai HT Telugu

01 June 2024, 17:00 IST

google News
    • Pregnancy Tips In Telugu : గర్భంతో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీతోపాటుగా మీ కడుపులో ఉన్న ప్రాణం కూడా ముఖ్యం. చాలా మంది గర్భిణులకు ఏ రంగు ద్రాక్ష తినాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది తింటే మంచిదో తెలుసుకోండి.
గర్భిణులు ఏ రంగు ద్రాక్ష తినాలి?
గర్భిణులు ఏ రంగు ద్రాక్ష తినాలి? (Unsplash)

గర్భిణులు ఏ రంగు ద్రాక్ష తినాలి?

ఒక మహిళకు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు ప్రతి క్షణం చాలా సవాలుగా ఉంటుంది. ప్రతి స్త్రీ ఈ సమయంలో అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం క్రమరాహిత్యం ఉన్నా తల్లి, బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. ప్రతి స్త్రీకి గర్భధారణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీలో రెండు ప్రాణాలు ఉన్నాయి. చాలా మంది గర్భం సమయంలో సరైన ఆహారాం తీసుకోరు. దీనితో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి.

ప్రతి గర్భిణి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ, తల్లి మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఆహారాలు తినాలి, ఏవి తినకూడదు అనేది చాలా ముఖ్యం. ఏది పడితే అది కూడా తినకూడదు. అలా చేస్తే రెండు జీవితాలపైనా ప్రభావం పడుతుంది.

గర్భధారణ సమయంలో ద్రాక్ష తినాలని వైద్యులు చెబుతారు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. పరిమిత పరిమాణంలో ద్రాక్ష తినడం తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచిది. అయితే వీటిని అతిగా తినడం మాత్రం మంచిది కాదు. సహజంగా పండినవి తింటే ఇంకా ఉత్తమం. కావాలంటే వీటిని నానబెట్టి తినాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ రంగు ద్రాక్షను తింటే మంచిదో తెలుసుకుందాం.

ద్రాక్ష ప్రయోజనాలు

ద్రాక్షలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆర్గానిక్ యాసిడ్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పెక్టిన్ మొదలైన పోషకాలు ఉంటాయి. అలాగే ద్రాక్షలో మెగ్నీషియం ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో కండరాల తిమ్మిరితో పోరాడటానికి సహాయపడుతుంది. మీ మెుత్తం ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరం.

గర్భిణీ రోజుకు ఒక గిన్నె ద్రాక్ష మాత్రమే తినాలి. దీన్ని ఉదయం, మధ్యాహ్నం మీ ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు. అయితే వీటిని అతిగా తినడం కూడా మంచిది కాదు. ఒక చిన్న గిన్నెలో తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసి తినాలి. ఒకవేల వాటి మీద ఏవైనా కెమికల్స్ ఉండే అవకాశం ఉంది. కాసేపు వాటిని నీటిలో నానబెట్టి తినాలి.

ఆకుపచ్చ ద్రాక్ష

గర్భధారణ సమయంలో ఆకుపచ్చ ద్రాక్షను తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల గర్భిణుల్లో ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. రుచిలో కాస్త పుల్లగా కూడా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యలకు కూడా కారణం అవుతుందని చెబుతారు.

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్ష బయటి చర్మం కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఈ సందర్భంలో గర్భిణీ స్త్రీలు జీర్ణం కావడం కష్టం. నిజానికి గర్భధారణ సమయంలో స్త్రీల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనితో తిన్నది అరగడానికి సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది.

ఎర్ర ద్రాక్ష

గర్భధారణ సమయంలో ఎర్ర ద్రాక్ష తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎర్ర ద్రాక్షలో విటమిన్-కె, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత తొలగిపోయి కండరాలు, ఎముకలు బలపడతాయి. అందుకే చాలా మంది వీటిని తినాలని సూచిస్తారు.

తదుపరి వ్యాసం