PM కిసాన్ 2 వేలు వస్తున్నాయో.. లేదో ఒక్క ఫోన్ కాల్ తెలుసుకోండి!
01 April 2022, 22:51 IST
- అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ యోజన స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద ప్రతి ఏడాదికి రూ.6,000 వరకు రైతుల అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) కింద 2022లో మెుదటి విడతగా ఇచ్చే రూ.2000 త్యరలో రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.
pm kisan samman
అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ యోజన స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద ప్రతి ఏడాదికి రూ.6,000 వరకు రైతుల అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) కింద 2022లో మెుదటి విడతగా ఇచ్చే రూ.2000 త్యరలో రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. ఇప్పటి వరకు 10 విడుతల్లో రైతుల ఖాతాలో నిధులు జమ కాగా.. 11వ విడత నిధులు కూడా త్వరలో రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో రైతు ఖాతాలో నిధులు జమా చేయనున్నారు. అయితే సాకేంతిక కారణాల వల్ల కిసాన్ సమ్మాన్ ఫండ్ డబ్బులు కొంత మంది రైతుల అకౌంట్‌లోకి రావడం లేదు. ఈ నేఫథ్యంలో ఈ సారి డబ్బులు పడే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి.
సాధరణంగా చాలా మంది పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి చేసుకుంటారు. సైట్‌కు వెళ్లలేని వారు ఫోన్ ద్వారా తమ వివరాలను పొందవచ్చు. PM కిసాన్ సమ్మాన్ ప్లాన్ ఫిక్స్‌డ్ ఫోన్ నంబర్: 011-23381092, 23382401. PM కిసాన్ సమ్మాన్ ప్లాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266. PM కిసాన్ ప్లానింగ్ హెల్ప్‌లైన్ నంబర్: 155261, 0120-602 ద్వారా రైతులు తమ స్టెటస్‌ను తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ 11వ ఎపిసోడ్ లబ్ధిదారుల జాబితాను కేంద్రం గురువారం (మార్చి 31) విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందలంటే తప్పనిసరిగా E-KYC చేయాల్సి ఉంటుంది. e-KYC పూర్తి కాకపోతే, PM కిసాన్ ప్రాజెక్ట్ నిధులు స్తంభింపజేసే అవకాశం ఉంది. డబ్బు రాకపోవడానికి ఇది ముఖ్య కారణం కావచ్చు.
టాపిక్