తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జిందగీ న మిలేగి దోబారా! రోడ్ ట్రిప్‌కు హైదరాబాద్‌కు దగ్గర్లో బెస్ట్ ఇవే

జిందగీ న మిలేగి దోబారా! రోడ్ ట్రిప్‌కు హైదరాబాద్‌కు దగ్గర్లో బెస్ట్ ఇవే

Manda Vikas HT Telugu

28 February 2022, 18:10 IST

    • ఈ వారాంతంలో చిన్న హాలిడే ఏదైనా లభిస్తే వెంటనే వెళ్లిపోయి, మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకొని వెంటనే తిరిగొచ్చేయచ్చు. విశ్రాంతి తీసుకోవాలని ఆరాటపడే నగర జీవుల కోసం, నిర్మలమైన నిశబ్ధమైన చోటుకు ఎక్కడికైనా వెళ్లిపోయి సేద తీరాలని కోరుకునే వారి కోసం హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రదేశాల వివరాలు అందిస్తున్నాం.
Road Trip
Road Trip (Shutterstock)

Road Trip

నేటి కాలంలో ఇంటి వద్ద నుంచే పని అయింది, బ్రతుకు నాలుగు గోడల మధ్య బందీ అయింది. బయటకు వెళ్తే అదే కాలుష్యం, అవే రణగొణ ధ్వనులు. వీటికి తోడు బాక్టీరియాలు, వైరస్‌లు మనుషుల్ని మాస్కులతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. వీటన్నింటి నుంచి కొంత విశ్రాంతి తీసుకోవాలని ఆరాటపడే నగర జీవుల కోసం, నిర్మలమైన నిశబ్ధమైన చోటుకు ఎక్కడికైనా వెళ్లాపోయి సేద తీరాలని కోరుకునే కష్టజీవుల కోసం, పచ్చని చెట్ల మధ్య ఉండి స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఊపిరి పొందాలనుకునే అభాగ్యుల కోసం ఈ వార్తను అందిస్తున్నాం. అధైర్యపడకండి, మిమ్మల్ని అమితంగా ఆదరిస్తూ సాదరంగా ఆహ్వానం పలికే అందమైన ప్రకృతి నేస్తాలు, మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత చేకూర్చే భగవంతుని సన్నిధాలు, గత స్మృతులను గుర్తుచేసే చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

ఈ వారాంతంలో చిన్న హాలిడే ఏదైనా లభిస్తే వెంటనే మీ బ్యాక్ ప్యాక్స్ సిద్ధం చేసుకొని, మీ దారి రహదారి అంటూ వెళ్లిపోయి, మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకొని వెంటనే తిరిగొచ్చేయచ్చు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న అలాంటి కొన్ని పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

ఆదిలాబాద్ అడవులు, జలపాతాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి రమణీయత గల ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బాసర సరస్వతి దేవాలయం, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, నిర్మల్ కొయ్యబొమ్మలు మొదలగునవి.

ఎలా చేరుకోవచ్చు?

హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ఈ పర్యాటక ప్రదేశాలున్నాయి. ముందుగా నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తే అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గంలో మాత్రమే చేరుకునే వీలుంది. నిర్మల్ కు నాలుగు లైన్ల నేషనల్ హైవే 44తో మంచి కనెక్టివిటీ ఉంది. రైలు మార్గంలో అయితే నిజామాబాద్ లేదా నేరుగా బాసర చేరుకోవాలి. ఈ రెండు నిర్మల్ సిటీకి కేవలం 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. అక్కడ్నించి మిగతా పర్యాటక ప్రాంతాలను రోడ్డు మార్గంలో చూసేయొచ్చు.

ఏమేమి ఉన్నాయంటే

నిర్మల్ లో హరిత రిసార్టుతో పాటు మల్టీకుసైన్ రెస్టారెంట్లు, ప్రైవేట్ లాడ్జీలకు కొదవలేదు. నిర్మల్ కేంద్రంలో చేతితో చేసే కొయ్యబొమ్మల పరిశ్రమ ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ్నించి ఆదిలాబాద్ వైపు 30-40 కిలోమీటర్లు ప్రయాణిస్తే కుంటాల జలపాతం ఉంటుంది. చుట్టూ అడవి, పచ్చదనం మధ్య కుంటాల జలపాతం గలగలమని శబ్దం చేస్తూ కిందకు దూకుతుంది. 

జలపాతం పైభాగం అంచున ఒక చిన్న గుహలో శివలింగం ఉంటుంది. ఈ దర్శనం అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరం. దీనికింద కలపాతం సుడులు తిరుగుతూ ఉంటుంది. పట్టుతప్పితే అంతే సంగతులు. కుంటాల జలపాతం వద్ద టిఫిన్స్, మీల్స్  లభిస్తాయి. దేశీ కోడికూరను అప్పటికప్పుడే ఆర్డర్ పై వండి, వడ్డిస్తారు. ఇక్కడ్నించి 20 కిలోమీటర్ల దూరం వెనక్కి మరోవైపు ప్రయాణిస్తే బోథ్ మండలంలో పొచ్చెర జలపాతం ఉంది. చుట్టూ పంటపొలాల మధ్యలో ఇది అద్భుత దృశ్యంలా ఉంటుంది.

తిరిగి వెనక్కి నిర్మల్ వస్తే అక్కడ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే దట్టమైన కవ్వాల్ అటవీప్రాంతం, సఫారీ ఆస్వాదించవచ్చు. తెలంగాణ టూరిజం వారు హరిత రిసార్ట్స్ తో పాటు పర్యాటకులకి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.అవతలవైపు ప్రయాణిస్తే 70 కిలోమీటర్ల దూరంలో భైంసా పట్టణం మీదుగా బాసర చేరుకోవచ్చు. నిర్మల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది.

కాకతీయుల ఖిల్లా, వరంగల్ జిల్లా

హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లా కేంద్రం ఉంటుంది. వరంగల్ వెళ్లే దారి మధ్యలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడకు రెలు, రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

కాకతీయుల కళావైభవాలుగా విలసిల్లుతున్న వెయ్యి స్తంభాల గుడి, రామప్ప మందిరం మొదలగు చారిత్రాత్మక కట్టడాలు చూడొచ్చు, జిల్లా కేంద్రం మహాకాళీ మందిరం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. వరంగల్ సిటీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉంది. ఈ చెరువులో 160 మీ పొడవైన హాంగింగ్ బ్రిడ్జ్ ఉండటం దీని ప్రత్యేకత, బోటింగ్ కూడా అభివృద్ధి చేశారు.

అలాగే ప్రకృతి సౌందర్యాలు నింపుకున్న పాకాల చెరువు వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతం సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ జిల్లా కేంద్రంలో ఒక రెండు రోజులు విడిది చేస్తే ఈ పర్యాటక ప్రాంతాలన్నీ మీ రోడ్ ట్రిప్ లో రౌండప్ చేసేయొచ్చు.

వరంగల్ చుట్టూ 60 కిలోమీటర్ల దూరంలో ఎన్నో చారిత్రాత్మక, ప్రకృతి సిద్ధమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అందమైన సరస్సుగా చెప్పబడే పాకాల చెరువు ఇక్కడే ఉంది.

కరీంనగర్ చారిత్రక వైభవం

హైదరాబాద్ నుంచి సుమారు160 కిలోమీటర్ల  దూరంలో ఉండే కరీంనగర్ జిల్లా కేంద్రం ఉంటుంది. ఇది తెలంగాణలోని ఒక చారిత్రాత్మక పట్టణం, దీనిని 'వేద అభ్యాస పీఠం' అని పిలుస్తారు. అనేక చారిత్రాత్మక కట్టడాలకు, అధ్యాత్మిక కేంద్రాలకు ఈ జిల్లా నిలయంగా ఉంది.

వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ప్రముఖమైన దైవ సన్నిధాలు సందర్శించవచ్చు.

ఇక్కడి చారిత్రక సంపదలైన ఎలగంధల కోట, నగునూర్ ఫోర్ట్, రామగిరి ఫోర్ట్, మోలంగూర్ ఫోర్ట్, జగిత్యాల కోటలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఎలాంటి గుంతలు, అడ్డంకులు లేని పరిశుభ్రమైన రహదారిపైన స్మూత్ రైడ్‌ను అనుభవించాలనుకునే వారికి, కరీంనగర్ మంచి ఛాయిస్ అవుతుంది.

వీటతో పాటు వికారాబాద్ అనంతగిరి హిల్స్, బీదర్ ఫోర్ట్, నాగార్జునా సాగర్ డ్యామ్, శ్రీశైలం టెంపుల్, సోమశిల రిజర్వాయర్, కర్నూలు ఫోర్ట్ లాంటి ప్లాంతాలు కూడా హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసేందుకు అనువుగానే ఉంటాయి.

తదుపరి వ్యాసం