తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Secret Santa: మీ కుటుంబ సభ్యులకు సీక్రెట్ శాంటా కోసం ఈ సర్‌‌ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేయండి, ఇవి తక్కువ ధరకే లభిస్తాయి

Secret Santa: మీ కుటుంబ సభ్యులకు సీక్రెట్ శాంటా కోసం ఈ సర్‌‌ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేయండి, ఇవి తక్కువ ధరకే లభిస్తాయి

Haritha Chappa HT Telugu

19 December 2024, 16:17 IST

google News
  • Secret Santa: క్రిస్మస్ సమీపిస్తోంది. మీరు గిఫ్ట్ షాపింగ్ గురించి ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఇచ్చాము. సీక్రెట్ శాంటా కోసం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఈ గిఫ్టులను ప్లాన్ చేసుకోండి.

క్రిస్‌మస్ గిఫ్టులు
క్రిస్‌మస్ గిఫ్టులు (Pexels)

క్రిస్‌మస్ గిఫ్టులు

క్రిస్మస్ సమీపిస్తోంది! మీకు ఇష్టమైన స్వెట్టర్లు, చాక్లెట్లు వంటివి ఎక్కువగా కొంటూ ఉంటారు. క్రిస్మస్‌కు కొన్ని రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మీకు ఇష్టమైన వారికి గిఫ్టింగ్ చేయడానికి ఇక్కడ కొన్ని ఐడియాలు ఇచ్చాము. ఇవి చాలా తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి.

కస్టమ్ చెక్కిన ఆభరణాలు లేదా సంక్లిష్టమైన చేతితో తయారుచేసిన హస్తకళలను పొందాలని లక్ష్యంగా పెట్టుకోండి. పురుషుల కోసం మంచి వాలెట్‌లు కొంటే గిఫ్టులుగా బావుంటుంది.

పురుషులకు టెక్ గాడ్జెట్లు చాలా నచ్చుతాయి. స్మార్ట్ వాచ్ లు, వైర్ లెస్ ఇయర్ బడ్‌లు, హెడ్‌సెట్, స్మార్ట్ హోమ్ పరికరాలను ఇస్టే ఉపయోగపడతాయి. హెల్మెట్‌లు, బ్యాక్ ప్యాక్‌లు, క్యాంపింగ్ గేర్, హైకింగ్ బూట్‌లు, రైడింగ్ యాక్సెసరీలు వంటివి కూడా ఇవ్వవచ్చు.

దుస్తులు, ఫ్యాషన్, స్వెటర్లు, మఫ్లర్లు, గ్లోవ్‌లు, బ్లేజర్లు వంటివి కూడా శీతాకాలంలో గిఫ్టులుగా ఇస్తూ ఉంటారు. బ్యాగులు, బెల్టులు, ఆభరణాలు, బూట్లు వంటివి కూడా గిఫ్టులుగా ఇవ్వచ్చు.

పిల్లలకు ఎడ్యుకేషనల్ బొమ్మలు, రిమోట్ కంట్రోల్ కార్లు, డాల్ సెట్‌లు, యాక్షన్ ఫిగర్, స్కూటర్, బైక్‌లు... ఈ బొమ్మలు క్రిస్మస్‌కు పిల్లలకు ఎంతో నచ్చుతాయి. చాక్లెట్ థీమ్ బాస్కెట్‌లు కూడా మార్కెట్లో లభిస్తాయి.

డిజిటల్ కెమెరా

డిజిటల్ కెమెరాలు మళ్లీ వాడుకలోకి వచ్చాయి. ఇది మీ బహుమతి పొందిన వారి ఇష్టమైన జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రతిచోటా తీసుకురావడానికి కాంపాక్ట్, 180-డిగ్రీ ఫ్లిప్ సెల్ఫీ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఇది సోలో మూమెంట్‌లను డాక్యుమెంట్ చేయడం సులభం చేస్తుంది.

ప్రింట్‌ఫ్రెష్ లాంగ్ స్లీప్ సెట్

ప్రింట్ ఫ్రెష్ కంపెనీకి చెందిన లాంగ్ స్లీవ్ సెట్ అమ్మాయిలకు ఎంతో నచ్చుతుంది. ఇది మీ గర్ల్ ఫ్రెండ్‌కు లేదా భార్యకు ఇది కొంటే బావుంటుంది. ఇందులో రూమి టాప్ మరియు మిడ్-రైజ్ బాటమ్‌లు ఉన్నాయి.

డెస్క్ మొక్కలు

ఉద్యోగులకు ఇచ్చే డెస్క్ మొక్కలు అందంగా ఉంటాయి. ఇవి పని ప్రదేశంలో పచ్చదనాన్ని, ప్రేమను కూడా వ్యాప్తి చేస్తాయి. ఎయిర్ ప్లాంట్లూ, సక్యూలెంట్స్ వంటి మొక్కలు కొంటే మంచిది.

పవర్ బ్యాంకులు

ఇప్పుడు ఫోన్ అత్యవసరమైనదిగా మారింది. అందుకే పవర్ బ్యాంకులను కూడా గిఫ్టుగా ఇవ్వచ్చు. ప్రయాణాల్లో వీటి అవసరం అధికంగా ఉంటుంది.

గిఫ్టు వోచర్లు

మీ స్నేహితులకు,సహోద్యోగులకు గిఫ్టు వోచర్లను కూడా ఇవ్వచ్చు. మీరు ఎంత ఖర్చు పెట్టి గిఫ్టు వోచర్ కొనాలనుకుంటున్నారో ఆ ఖరీదుక అమెజాన్ లో గిఫ్టు వోచర్ ఆర్ధర్ చేయవచ్చు. ఈ ఆలోచన కూడా కొత్తగా ఉంటుంది.

తదుపరి వ్యాసం