తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Bhurji Sandwich: బ్రేక్‌ఫాస్ట్‌లో పనీర్ బుర్జీ సాండ్‌విచ్ ట్రై చేయండి, దీని రుచి అదిరిపోతుంది చేయడం కూడా చాలా సుల

Paneer bhurji sandwich: బ్రేక్‌ఫాస్ట్‌లో పనీర్ బుర్జీ సాండ్‌విచ్ ట్రై చేయండి, దీని రుచి అదిరిపోతుంది చేయడం కూడా చాలా సుల

Haritha Chappa HT Telugu

03 September 2024, 6:30 IST

google News
    • Paneer bhurji sandwich: ఎప్పుడూ ఇడ్లీ, దోశ, ఉప్మా తినడం బోర్ కొడితే అప్పుడప్పుడు పనీర్ బుర్జీ సాండ్‌విచ్ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది.
పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీ
పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీ

పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీ

Paneer bhurji sandwich: బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ నిండుగా ఉన్న ఆహారాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ మేము పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీ ఇచ్చాము. పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. శాకాహారులకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి. మాంసాహారులు కోడిగుడ్డు తినడం ద్వారా ప్రోటీన్ ను పొందవచ్చు. పనీర్ బుర్జీ సాండ్‌విచ్ చేయడం చాలా సులువు. దీన్ని ఒకసారి చేశారంటే మీరు పదేపదే చేసుకొని తినేలా ఉంటుంది.

పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రెడ్ ముక్కలు - నాలుగు

బటర్ - రెండు స్పూన్లు

జీలకర్ర - అర స్పూను

నూనె - ఒక స్పూను

వెల్లుల్లి తురుము - ఒక స్పూను

పసుపు - చిటికెడు

కారం - అర స్పూను

గరం మసాలా పొడి - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

పనీర్ ముక్కలు - ముప్పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెసిపీ

1. ముందుగా పనీర్ బుర్జీని రెడీ చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించుకోవాలి.

4. తర్వాత పనీర్ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర తరుగు, ఆమ్చూర్ పొడి వేసి అన్ని బాగా కలపాలి.

5. అందులోనే గరం మసాలా కూడా వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. అంతే పనీర్ బుర్జీ రెడీ అయినట్టే.

6. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క తీసుకొని దానిపైన బటర్ రాయాలి.

7. ఉల్లిపాయలను రింగులు రింగులుగా కట్ చేసి పెట్టుకోవాలి.

8. అలాగే టమాటాను కూడా రింగులుగా కట్ చేసి పెట్టాలి.

9. దానిపై పనీర్ బుర్జీని వేసుకోవాలి. మరొక బ్రెడ్ తో దాన్ని మూసివేసి గ్రిల్ చేసుకోవాలి.

10. అంతే టేస్టీగా పనీర్ బుర్జీ సాండ్‌విచ్ రెడీ అయిపోతుంది.

11. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

పనీర్ బుర్జీ సాండ్‌విచ్ చేసుకోవడానికి ముందు మీరు బ్రెడ్ ను ఆరోగ్యకరమైనది ఎంచుకోవాలి. బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ వంట చేయించుకుంటే మంచిది. మైదా చేసిన సాధారణ బ్రెడ్ ను ఎంచుకుంటే ఆరోగ్యానికి కలిగే మేలు తక్కువే. మైదాతో చేసిన వంటకాలు ఏ మాత్రం మంచివి కాదు.

టాపిక్

తదుపరి వ్యాసం