తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Garelu: పిల్లల కోసం పాలకూర గారెలు చేసి పెట్టండి, ఇవి చాలా హెల్దీ

Palak Garelu: పిల్లల కోసం పాలకూర గారెలు చేసి పెట్టండి, ఇవి చాలా హెల్దీ

Haritha Chappa HT Telugu

28 February 2024, 15:50 IST

google News
    • Palak Garelu: పిల్లలు పాలకూర తినడం లేదా? ఇలా గారెలు చేసి పెట్టండి. చిటికెలో తినేస్తారు. ఇవి క్రంచీగా, టేస్టీగా ఉంటాయి.
పాలకూర గారెలు
పాలకూర గారెలు (youtube)

పాలకూర గారెలు

Palak Garelu: సాయంత్రం అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని పెట్టడం చాలా ముఖ్యం. పాలకూరతో చేసిన గారెలను పెట్టి చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి. పిల్లలు పాలకూరతో చేసిన వంటకాలు తినేందుకు ఇష్టపడరు. కానీ పాలకూర గారెలు మాత్రం ఇష్టంగా తింటారు. ఒకసారి వీటిని వారికి పెట్టి చూడండి. మళ్లీ మళ్లీ కావాలని వారే అడుగుతారు.

పాలకూర గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర తరుగు - ఒక కప్పు

శనగపప్పు - ఒకటిన్నర కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - వేయించడానికి సరిపడా

పచ్చిమిర్చి - నాలుగు

పాలకూర గారెలు రెసిపీ

1. పాలకూరలు ఆకులు ఏరి సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు శనగపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సీ జార్ లో శెనగపప్పును వేసి రుబ్బుకోవాలి.

4. కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే గారెలు టేస్టీగా ఉంటాయి.

5. ఈ శనగపప్పు రుబ్బును ఒక గిన్నెలో వేయాలి.

6. ఆ గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన పాలకూర, కారం వేసి బాగా కలుపుకోవాలి.

7. ఈ మిశ్రమము గట్టిగా ఉంటేనే గారెలు బాగా వస్తాయి.

8. కాబట్టి నీరు ఎక్కువగా వేయకండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

9. ఆ నూనెలో శనగపప్పు మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకొని వేయాలి.

10. రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి.

11. టేస్టీ టేస్టీ పాలకూర శెనగపప్పు గారెలు రెడీ అయినట్టే.

పిల్లలు పాలకూర రుచిని ఇష్టపడరు. అందుకే వారు పాలకూరతో చేసిన కూరలను, వేపుడు తినరు. ఇలాంటి పాలకూర గారెలు, వడలు వేస్తే ఇష్టంగా తింటారు. అలాగే పాలకూర కూడా వారి శరీరంలో చేరుతుంది. కాబట్టి ఎన్నో పోషకాలు చేరుతాయి.

పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. క్యాన్సర్ వ్యాధులు రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు పాలకూరను తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఇది అందుకుంటుంది. పాలకూర తినడం వల్ల చర్మం, ఎముకలు, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూరలో ఉండే బీటా కెరాటిన్ వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణులు కచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. ఇది పిల్లల్లో ఎలాంటి లోపాలు రాకుండా అడ్డుకుంటుంది.

తదుపరి వ్యాసం