తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Online Jobs: ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా డబ్బు సంపాదించేయండి!

Online Jobs: ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా డబ్బు సంపాదించేయండి!

HT Telugu Desk HT Telugu

09 July 2022, 16:40 IST

  •  కోవిడ్‌ కారణంగా చాలా మంది అన్‌లైన్ పని విధానానికి మెుగ్గు చూపుతున్నారు. ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగడంతో ఆన్‌లైన్ / వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి.

Online Jobs
Online Jobs

Online Jobs

కరోనా ప్రభావం నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే తెరుకుంటుంది. ఈ మహమ్మారి కారణంగా మానవాళి అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా చాలా మంది ఉపాది అవకాశాలను కొల్పోయారు. ఇప్పటికీ ఉద్యోగాలకు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాగే కరోనా సమయంలో పని సంస్కృతి మారింది. ఆన్‌లైన్ / వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఆన్‌లైన్ పని విధానం విస్తృతంగా పెరిగింది. ఇక్కడ అనేక ఉపాది అవకాశాలు ఉన్నాయి. పార్ట్‌టైమ్/ పుల్ టైమ్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

1- అనువాదం: చదవడం, వ్రాయడంతో కనీసం రెండు భాషలపై అవగాహన ఉన్నవారికి, ట్రాన్స్‌లేషన్ వర్క్ ద్వారా ఆదాయం పొందవచ్చు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. fever.com, upwork.com, freelancer.com, guru.com, iFreelance.com వంటి కొన్ని వెబ్‌సైట్‌లలో టాన్స్‌లెషన్ ఉద్యోగాలు ఉంటాయి.

2- బ్లాగింగ్: మీరు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మీ ఆసక్తికి అనుగుణంగా మీ స్వంత బ్లాగును ప్రారంభించవచ్చు. బ్లాగ్ మానిటైజేషన్ గత దశాబ్దం నుండి ఊపందుకుంది. అందులో ఆసక్తికరమైన అంశాలను రాస్తూ ఆదాయాన్పి పొందవచ్చు. బ్లాగ్‌ని మానిటైజ్ చేయడానికి, మీరు Google Adsenseతో సైన్ అప్ చేయాలి. ఇది మీ బ్లాగ్‌లో ప్రకటనలను ఇస్తుంది. పేజీ వీక్షణల ప్రకారం మీరు ఆదాయాన్ని పొందుతారు.

3- ఆన్‌లైన్ ట్యూటర్: కరోనా సంక్షోభం సమయంలో ఆన్‌లైన్ ట్యూషన్‌కు ట్రెండ్ పెరిగింది. మీకు ఏదైనా సబ్జెక్టులో ప్రావీణ్యం ఉంటే, స్వయంగా ఆన్‌లైన్ ట్యూటరింగ్ పనిని ప్రారంభించవచ్చు. ఇందులో మీ పనిని బట్టి ఆదాయం లభిస్తుంది. యోగా ట్రెనర్‌ లేదా సంగీత ఉపాధ్యాయులు కూడా ఆన్‌లైన్ శిక్షణ తరగతులను ప్రారంభించవచ్చు.

4 ఆన్‌లైన్ అమ్మకాలు: చాలా కాలంగా కరోనా సంక్షోభం కారణంగా, దేశంలో ఆన్‌లైన్ మార్కెట్ విస్తృతి పెరిగింది. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ఆన్‌లైన్ వస్తువులను అమ్మడం ద్వారా ఉపాది పొందవచ్చు. మీ స్వంత ఉత్పత్తలను తయారి చేసి థర్గ్ పార్టీ ఈ కామర్స్ ద్వారా లేదా స్వంతంగా ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం