తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

HT Telugu Desk HT Telugu

07 July 2022, 11:02 IST

google News
    • ts high court jobs: తెలంగాణ హైకోర్టులో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. దరఖాస్తుల స్వీకరణకు జూలై 22వ తేదీని తుది గడువుగా ప్రకటించింది.
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు (tshc)

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

Telangana High Court Jobs 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తుండగా... తాజాగా తెలంగాణ హైకోర్టులో 65 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. ఇందులో రిజిస్ట్రార్ల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీలు, జడ్జిలు, కోర్టు మాస్ట‌ర్ల పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొంది.

అర్హతలు...

దేశంలోని ఏ యూనివ‌ర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా లా విద్య‌ను అభ్య‌సించిన వారంద‌రూ ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుదారుల‌కు 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 34 ఏండ్ల వ‌య‌సు మించ‌రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితి సడలింపు ఇచ్చారు.

ఫీజు....

ఓసీ, బీసీ కేట‌గిరిల వారు రూ. 800 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. డీడీల‌ను 'ది రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట(The Registrar (Recruitment), High Court for the State of Telangana”,) తీయాల్సి ఉంటుంది.

పోస్టు లేదా కొరియర్....

ద‌ర‌ఖాస్తుల‌ను స్పీడ్ పోస్టు లేదా కొరియ‌ర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంట‌ల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి. దీనిపై సంబంధింత పోస్టు పేరుతో పాటు to the Registrar (Recruitment), High Court for the State of Telangana, Hyderabad-500026 కు పంపాల్సి ఉంటుంది.

NOTE

లింక్ పై క్లిక్ చేసి హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి సంబంధిత వివరాలను, దరఖాస్తు ఫారమ్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం