తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ongc Recruitment 2022: Ongcలో 3614 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ONGC Recruitment 2022: ONGCలో 3614 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

15 May 2022, 15:31 IST

    • ONGC Recruitment 2022: ONGCలో 3614 అప్రెంటిస్ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) వంటి విభాగాల్లో అప్రెంటిస్‌ను తీసుకోనున్నారు
ONGC Recruitment 2022:
ONGC Recruitment 2022:

ONGC Recruitment 2022:

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ONGC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 కింద మొత్తంగా 3614 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ONGC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 22 మే 2022.

ట్రెండింగ్ వార్తలు

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

ఖాళీల వివరాలు- ONGC ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా మొత్తం 3614 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో నార్తర్న్ సెక్టార్‌లో 209, ముంబై సెక్టార్‌లో 305, వెస్ట్రన్ సెక్టార్‌లో 1434, ఈస్టర్న్ సెక్టార్‌లో 744, సదరన్ సెక్టార్‌లో 694, సెంట్రల్ సెక్టార్‌లో 228 పోస్టులు భర్తీ చేయనున్నారు.

 ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఫిట్టర్, కోపా ట్రేడ్స్‌లో అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి.

వయోపరిమితి: ONGC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి పుట్టిన తేదీ 22.05.1992 నుండి 22.05.2004 మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇద్దరు అభ్యర్థుల మార్కులు ఒకేలా ఉంటే, వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం