తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Govt Jobs | పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం చూసుకున్నారా? ఇదిగో తాజా అప్డేడ్ మీకోసమే

Govt Jobs | పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం చూసుకున్నారా? ఇదిగో తాజా అప్డేడ్ మీకోసమే

HT Telugu Desk HT Telugu

25 April 2022, 19:59 IST

    • ఇక తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. ఇప్పటికే.. పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేవారి కోసం మరో అప్డేట్ వచ్చింది.
తెలంగాణ ఉద్యోగాలు
తెలంగాణ ఉద్యోగాలు

తెలంగాణ ఉద్యోగాలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి.. ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారి కోసం మరో అప్ డేట్ వచ్చింది. ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

గ్రూప్​-1లో 19 రకాల పోస్టులకు గానూ 900 మార్కులతో రాతపరీక్షను ఉండనున్నట్టు పేర్కొంది. గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు 600 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాతపరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. 300 మార్కులకు రాతపరీక్ష ఉంటాయి.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుంది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున గ్రూప్- 1 మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాద్యమాల్లో నియామక పరీక్షలు.. ఉంటాయి. 

గ్రూప్స్‌ విభాగంలో భర్తీ.. కానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానం ఉండనున్నట్లు సర్కారు ప్రకటించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రేంజ్ ఆఫీసర్, జిల్లా సైనిక సంక్షేమాధికారి, సూపర్ వైజర్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్​లేటర్, సీనియర్ రిపోర్టర్‌, ఇంగ్లీష్ రిపోర్టర్ ఉద్యోగాల పరీక్షా విధానం కూడా తెలిపింది.

తదుపరి వ్యాసం