తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aadhar Card: ఆధార్ కార్డును వాట్సప్‌తో ఇలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోండి!

aadhar card: ఆధార్ కార్డును వాట్సప్‌తో ఇలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

07 October 2022, 19:35 IST

google News
  • aadhar card:ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. కొన్ని సులభమైన దశల ద్వారా, మీరు వాట్సప్‌  ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

Aadhar_card
Aadhar_card

Aadhar_card

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని సంవత్సరాల క్రితం వినియోగదారుల సౌకర్యార్థం డిజిలాకర్ సేవను ప్రారంభించింది. డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఉంచవచ్చు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. కొన్ని సులభమైన దశల ద్వారా, మీరు వాట్సప్‌తో మీ ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

వాట్సప్ నుంచి ఆధార్ కార్డును ఈ విధంగా డౌన్ లోడ్ చేసుకోండి

ముందుగా మీరు మీ ఫోన్ లో +91-901315151515 మొబైల్ నెంబరును సేవ్ చేయాల్సి ఉంటుంది.

ఈ నెంబరు myGov హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబరు అని సెవ్ చేసుకోండి

మొబైల్ నంబర్ సేవ్ చేసిన తరువాత, WhatsApp ఓపెన్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్ ని రీఫ్రెష్ చేయండి.

జాబితాను రీఫ్రెష్ చేసిన తరువాత, MyGov హెల్ప్ డెస్క్‌తో మీ చాట్ బాక్స్ ని తెరవండి.

చాట్ బాక్స్ ఓపెన్ చేసిన తరువాత మీరు హలో లేదా హాయ్ అని టైప్ చేయడం ద్వారా పంపాల్సి ఉంటుంది.

అప్పుడు చాట్ బాక్స్ డిజిలాకర్, కోవిన్ సేవలో ఒకదాన్ని ఎంచుకోమని మిమ్మల్ని అడుగుతుంది. మీరు డిజిలాకర్ సేవను ఎంచుకోవాలి.

దాని తరువాత మీకు డిజిలాకర్ ఖాతా ఉన్నదా అని మిమ్మల్ని అడుగుతారు, మీకు ఖాతా ఉంటే అవును ట్యాప్ చేయండి.

ఒకవేళ మీకు ఖాతా లేనట్లయితే, డిజిలాకర్ యాప్ లేదా అధికారిక సైట్ ని సందర్శించడం ద్వారా మీరు మీ ఖాతాను సృష్టించవచ్చు.

12 అంకెల ఆధార్ కార్డు నెంబరును నమోదు చేయమని మిమ్మల్ని అడుగుతారు. నెంబరును వెరిఫై చేయడం కొరకు మీ మొబైల్ కు ఒక OTP పంపబడుతుంది.

అందుకున్న ఒటిపిని మొబైల్ నెంబరుపై ఎంటర్ చేయండి. ఒటిపి ఎంటర్ చేసిన తరువాత, మీ డిజిలాకర్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ లను మీరు చూస్తారు.

ఆధార్ కార్డు ఆప్షన్ ఎంచుకోవడానికి, మీరు 1 పంపాల్సి ఉంటుంది, మీరు 1 పంపిన వెంటనే, మీరు మీ ఆధార్ కార్డును పిడిఎఫ్ ఫార్మాట్ లో పొందుతారు.

తదుపరి వ్యాసం