తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nokia 2660 Flip । టచ్ కాదు.. ఫ్లిప్ చేయండి, నోకియా నుంచి మరో అందమైన ఫోన్!

Nokia 2660 Flip । టచ్ కాదు.. ఫ్లిప్ చేయండి, నోకియా నుంచి మరో అందమైన ఫోన్!

HT Telugu Desk HT Telugu

30 August 2022, 16:33 IST

google News
    • నోకియా బ్రాండ్ నుంచి ఆకర్షణీయమైన Nokia 2660 Flip ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. మీకు సింపుల్ గా, స్టైలిష్ గా ఉండే పాత ఫోన్లు ఇష్టముంటే ఈ ఫోన్ మీ అంచనాలకు తగినట్లుగా ఉందో లేదో ఇక్కడ తెలుసుకోండి.
Nokia 2660 Flip
Nokia 2660 Flip

Nokia 2660 Flip

భారీ స్పెక్స్ ఉండే స్మార్ట్‌ఫోన్ మోడల్స్ లాగా కాకుండా ఫీచర్ ఫోన్లు వాటి ఆకట్టుకునే డిజైన్, బ్యాటరీ లైఫ్ వంటి అంశాలతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నోకియా ఇప్పటికీ కూడా అటు స్మార్ట్‌ఫోన్లతో పాటు, ఇటు ఫీచర్ ఫోన్లను విడుదల చేస్తుంది.

నోకియా బ్రాండ్ హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేసే HDMI గ్లోబల్ సంస్థ తాజాగా మరొక క్లాసిక్ మోడల్ ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Nokia 2660 Flip పేరుతో విడుదలైన ఈ ఫోన్ పేరుకు తగినట్లుగానే ఫ్లిప్ మోడల్ హ్యాండ్‌సెట్‌. ఇది బ్లూ, బ్లాక్ అలాగే రెడ్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ సరికొత్త Nokia 2660 Flip ఫోన్ మన్నికైన పాలికార్బోనేట్ షెల్‌తో తయారైంది. ఇది చూడటానికి దృఢంగా, ప్రీమియం ఫోన్ గా కనిపిస్తుంది. దీని బరువు కేవలం 123 గ్రాములు మాత్రమే. దీనిని సింగిల్ సిమ్ లేదా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ ఫోన్ అయినందున బయటి వైపు 1.77 అంగుళాల డిస్‌ప్లే, అదేవిధంగా లోపలి వైపు 2.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

HDMI గ్లోబల్ కొంతకాలం క్రితమే ఈ Nokia 2660 Flip ఫోన్‌ను యురోపియన్ దేశాలలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇండియాలోనూ విడుదల చేసింది. మరి ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమైనా మారాయా? ధర ఏ విధంగా ఉంది వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Nokia 2660 Flip స్పెసిఫికేషన్లు

  • 1.77 అంగుళాల బాహ్య డిస్‌ప్లే, 2.8 అంగుళాల అంతర్గత డిస్‌ప్లే
  • Unisoc T107 ప్రాసెసర్‌
  • 48 MB RAM, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్, 32GB వరకు ఎక్స్‌పాండబుల్
  • LED ఫ్లాష్‌తో కూడిన 0.3MP కెమెరా
  • 1450mAh బ్యాటరీ

ఇంకా 4G VoLTE కనెక్టివిటీ, QWERTY కీప్యాడ్, FM రేడియో, మైక్రో-USB 2.0 పోర్ట్, 3.5mm హెడ్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ ధర, రూ. 4,669/-

నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన మిగతా ఫీచర్ ఫోన్ల వివరాలు ఈ కింది లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం