తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Nirf Rankings: టాప్‌ 15లో Iit హైదరాబాద్.. ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ ఎంతంటే!

NIRF Rankings: టాప్‌ 15లో IIT హైదరాబాద్.. ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ ఎంతంటే!

HT Telugu Desk HT Telugu

15 July 2022, 15:49 IST

google News
    • నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF Rankings 2022) జాబితాను  విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌  విడుదల చేశారు. ఈ ర్యాంక్‌లో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది కూడా మొదటి ర్యాంకును సాధించింది.
NIRF Rankings
NIRF Rankings

NIRF Rankings

దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థల రాంక్యులను ఎన్ఐఆర్ఎఫ్ విడుదల చేసింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF Rankings 2022)ని విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ ర్యాంక్‌లో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది మొదటి ర్యాంకును సాధించింది. రెండో స్ధానంలో ఐఐఎస్ సీ బెంగళూరు ఉండగా.. ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్‌ విధానాన్ని ఎన్ఐఆర్ఎఫ్‌గా చెబుతారు.

దేశవ్యాప్తంగా 45,000 డిగ్రీ కాలేజీలు, 1,000 యూనివర్సిటీలు, 1,500 ప్రముఖ విద్యా సంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్‌లో సభ్యత్వం ఉంది. 2021లో 6,000 సంస్థలే ర్యాంకుల్లో పాల్గొనగా.. 2022లో 7,254 విద్యా సంస్థలు పోటీ పడ్డాయి. ఫార్మసీ, మెడికల్‌, ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, అటల్‌ ర్యాకింగ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ ఎచివ్‌మెంట్స్‌, లా అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఓవరాల్‌, యూనివర్శిటీ, మేనేజ్‌మెంట్‌, కాలేజీ, వంటి కేటగిరీల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. గతేడాది ప్రకటించిన రాంక్యుల్లో కూడా ఈ మూడు విద్యాపంస్థలకే టాప్ ర్యాంక్ దక్కడం విశేషం. వైద్య కళాశాలలో ఢిల్లీ ఎయిమ్స్ మెుదటి స్థానంలో నిలవగా, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ దేశంలోనే టాప్ న్యాయ కళాశాలగా నిలిచింది. ఇక మిరండా హౌస్ అత్యుత్తమ కళాశాలగా చోటు సంపాదించుకుంది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. టాప్ 100 ఓవరాల్‌ ర్యాంకిగ్‌లో IIT (Indian Institute of Technology Hyderabad) హైదరాబాద్‌కు 14 వ ర్యాంక్, University of Hyderabadకు 20 ర్యాంక్, NIT (National Institute of Technology) వరంగల్‌కు 45వ ర్యాంక్, ఉస్మానియా యూనివర్సిటీకి 46 ర్యాంక్ దక్కింది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ రెండో స్థానం పొందింది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ విద్యా సంస్థకు కూడా Top 100లో చోటు దక్కకపోవడం గమనార్హం.

టాప్-10 ఇనిస్టిట్యూషన్స్ (ఓవరాల్ కేటగిరీ)

IIT Madras, Chennai, Tamil Nadu

Indian Institute of Science (IISC), Bangalore, Karnataka

IIT Bombay, Mumbai, Maharashtra

IIT Delhi, Delhi

IIT Kanpur, UP

IIT Kharagpur, West Bengal

IIT Roorkee, Uttarakhand

IIT Guwahati, Assam

AIIMS, New Delhi

Jawaharlal Nehru University (JNU), New Delhi

టాప్-3 యూనివర్సిటీలు

Indian Institute of Science (IISC), Bangalore, Karnataka

Jawaharlal Nehru University (JNU), New Delhi

Delhi Jamia Millia Islamia (JMI), New Delhi, Delhi

టాప్-3 ఇంజనీరింగ్ సంస్థలు

IIT Madras, Chennai, Tamil Nadu

IIT Delhi, New Delhi

IIT Bombay, Mumbai, Maharashtra

టాప్-3 వైద్య కళాశాలలు

ఎయిమ్స్, న్యూఢిల్లీ

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్

క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు, తమిళనాడు

తదుపరి వ్యాసం