Labour Code: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు!
12 September 2022, 17:31 IST
- New Labour Code: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు (New Labour codes) త్వరలో అమల్లోకి తీసుకోచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త కార్మిక చట్టంలో కీలక మార్పులు చేశారు.
new labour code
కొత్త కార్మిక చట్టాన్ని త్వరలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగుల ప్రయోజనాల చేకూరేలా వారి పని సంస్కృతి, సౌలభ్యం ప్రకారం ఈ మార్పులు ఉండనున్నాయి. కొత్త కార్మిక చట్టం ( new labour law 2022) ప్రకారం ఉద్యోగులకు ఎక్కువ సెలవులు లభించే అవకాశం ఉంది. వారి పని వేళలలో కూడా భారీగా మార్పులు ఉండవచ్చు. ఈ కొత్త కార్మిక చట్టంలోని ప్రత్యేక అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా (మూడు రోజుల సెలవులు) ఏకకాలంలో అమలు చేయనుంది. దీంతో అన్ని రాష్ట్రాలు కొత్త కార్మిక చట్టాలకు అణుగుణంగా ( (New Labour codes update) మార్పులు చేయాల్సి వస్తుంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం, PF కాంట్రిబ్యూషన్, పని సమయం, వారంతం సెలవుల్లో పలు మార్పులు రానున్నాయి
వారంలో 3 రోజులు సెలవు
కొత్త కార్మిక చట్టంలో లేబర్ కోడ్ వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన 4 కొత్త కోడ్‌లు ఉంటాయి. వీటన్నింటికీ వేర్వేరు నియమాలు, నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా, 3 రోజుల సెలవులకు సంబంధించిన అంశాన్ని కోడ్‌లో ముఖ్యంగా చేర్చనున్నారు. అంటే ఉద్యోగులకు వారంలో 3 రోజులు సెలవు లభించనున్నాయి. దీంతో రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది. ఈ కారణంగా వారంలో మూడు వారంతం సెలవులు వస్తాయి.
పని గంటలు పెరుగుతాయి
కొత్త కోడ్‌లో 3 రోజులు సెలవులు 4 రోజుల పని దినాలు ఉంటాయి. పని వేళాల్లో కీలక మార్పులు రానున్నాయి. వారం మొత్తం పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలి. 9 గంటలు పని చేస్తే కొత్త విధానంలో 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారానికి 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులు లభించే విషయం. దీనివల్ల ఉద్యోగులు కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయిస్తారు.
సుదీర్ఘ సెలవుల ప్రయోజనం
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలంటే ఏదైనా కంపెనీలో 180 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విధానంలో దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలంటే ఆ ఉద్యోగి 240 రోజులకు పైగా ఆ సంస్థలో పని చేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీలో 6 నెలలు పనిచేసినట్లయితే, మీరు అక్కడ లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు బాగా కలుసోచ్చే అంశం.