Nagula Panchami 2022 : ఇవాళ నాగుల పంచమి.. కాబట్టి ఈ పనులు చేయకండి..
02 August 2022, 8:25 IST
- Nagula Panchami 2022 : శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమిని భక్తులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సంవత్సరం నాగుల పంచమి.. ఆగస్టు 2వ తేదీ మంగళవారం వచ్చింది. దీనిలో భాగంగా గోపురాలన్నీ పూజకు సిద్ధమయ్యాయి. ఈరోజు శివునితో పాటు.. ఆయన మెడలో ఉన్న (వాసుకిని) పామును భక్తులు శ్రద్ధతో పూజిస్తారు. అయితే ఈరోజు ముహుర్తం ఏమిటి? చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నాగుల పంచమి 2022
Nagula Panchami 2022 : శ్రావణమాసంలోని చాంద్రమాన పక్షంలోని ఐదవరోజున నాగుల పంచమి వస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజుని శివునితో పాటు.. ఆయన మెడలో ఉన్న వాసుకిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం.. నాగుల పంచమి రోజున.. జీవించి ఉన్న పామును కాకుండా.. నాగదేవత విగ్రహాన్ని పూజించాలి. ఈ రోజు శివుడిని పూజించి.. రుద్రాభిషేకం చేసిన భక్తుడు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు.
అయితే కొందరు స్త్రీలు నాగదేవతలను పూజిస్తే.. మరికొందరు సజీవంగా ఉన్న పాములకు పాలు, స్వీట్లు, పువ్వులు సమర్పిస్తారు. ఎందుకంటే అవి స్వర్గంలో ఉన్న నాగ దేవతలను సూచిస్తాయి కాబట్టి. పైగా కొందరు పూజకోసం వాటి మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. కొంతమంది పాముకాటు నుంచి రక్షించుకోవడానికి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.
నాగుల పంచమి చరిత్ర
కృష్ణుడు చిన్నతనంలో యమునా నది ఒడ్డున ఆడుకుంటుండగా.. బంతి న్ది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మల్లో పడుతుంది. అది తీసే క్రమంలో బంతి నదిలో పడుతుంది. కృష్ణుడు ఆ బంతిని తీసే క్రమంలో నీటిలో ఉన్న కాళీయ అనే పాము అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది.
దానితో కృష్ణుడు పోరాడగా.. తనని చంపవద్దని కాళీయ వేడుకుంటుంది. అత్యంత విషపూరితమైన పాము కాళియాపై కృష్ణుడు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి.. శ్రావణమాసంలోని ఐదవ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇది పాము భీభత్స పాలనకు ముగింపుని సూచిస్తుంది.
Naga Panchami date: నాగుల పంచమి తేదీ, ముహుర్తం..
ఈ ఏడాది నాగుల పంచమికి ఓ ప్రత్యేకత ఉంది. ఈరోజు మొదటి మంగళ గౌరీ వ్రతం, నాగుల పంచమి రెండూ ఒకేరోజు వచ్చింది. శ్రావణమాసంలో ప్రతి మంగళవారం.. మంగళ గౌరీ వ్రతం చేస్తారు. మాంగళ్యం కోసం మహిళలు మంగళవారం ఉపవాసం చేసి.. పార్వతీ దేవికి అంకితమిస్తారు.
* నాగుల పంచమి తేదీ: ఆగష్టు 2, 2022
* నాగుల పంచమి తిథి ప్రారంభం: ఆగష్టు 2, 2022 - 05:13 AM
* నాగుల పంచమి తిథి ముగింపు: ఆగష్టు 3, 2022 - 05:41 AM
* నాగుల పంచమి పూజ ముహూర్తం: 2 ఆగస్టు, 2022 - 05:43 AM నుంచి 08:25 AM వరకు..
నాగుల పంచమి రోజు చేయాల్సిన, చేయకూడని పనులు..
చేయవలసినవి..
* నాగ దేవతలకు పాలు, మిఠాయిలు, పువ్వులను సమర్పించి.. వాటితో పూజించండి.
* నాగుల పంచమి రోజున ఉపవాసం చేయవచ్చు. ఇది పాముకాటు భయం నుంచి రక్షణగా ఉంటుందని భక్తులు భావిస్తారు.
* నాగుల పంచమి రోజు శివునికి రుద్రాభిషేకం చేయండి. పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలను పొందేందుకు ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.
* నాగుల పంచమి మంత్రాలను పఠించండి.
చేయకూడనివి..
* ఇనుముతో చేసిన పాత్రలను వంటకు ఉపయోగించకూడదు.
* చెట్లపై నివశించే పాములకు చేయకూడదు కాబట్టి ఈ రోజు చెట్లను నరకవద్దు.
* నాగుల పంచమి రోజున సూదులు లేదా ఏదైనా పదునైన వస్తువును ఉపయోగించడం మానుకోండి.