తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ashadam Myths : కొత్త జంటను ఆషాడంలో ఎందుకు కలిసి ఉండనివ్వరో తెలుసా?

Ashadam Myths : కొత్త జంటను ఆషాడంలో ఎందుకు కలిసి ఉండనివ్వరో తెలుసా?

28 June 2022, 11:40 IST

google News
    • నేటి నుంచి ఆషాడం మొదలైపోయింది. అయితే ఆషాడంలో కొత్తగా పెళ్లైనవారిని కలిసి ఉండనివ్వరు. అమ్మాయిని అత్తారింటికి పంపేస్తారు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు. మరి వీటి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసా? తెలియకపోతే ఇప్పడు తెలుసుకుందాం.
ఆషాడంలో నమ్మకాలు
ఆషాడంలో నమ్మకాలు

ఆషాడంలో నమ్మకాలు

Ashadam Month : తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడ మాసాన్ని పవిత్రంగా భావించరు. అందుకే ఈ ఆషాడ మాసంలో శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా వివాహాలు అస్సలు చేయరు. కొత్త కోడల్ని కూడా అత్తగారింట్లో ఉండనివ్వరు. ఎందుకంటే.. ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని.. దీనివల్ల కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు చేయరు.

కొత్త కోడలు..

ఆషాడంలో కొత్తగా వచ్చిన కోడలిని అత్తగారింట్లో ఉండనివ్వరు. వారిని కచ్చితంగా పుట్టింటికి పంపిస్తారు. ఎందుకంటే ఆషాడ మాసంలో భర్యభర్తలు కలిసి.. అమ్మాయి గర్భం దాల్చితే.. తల్లి, బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తారు. పైగా ఈ మాసంలో గర్భం దాలిస్తే.. మండు వేసవిలో పిల్లలు పుడతారని.. ఆ ఎండలు పిల్లలకు అంత మంచిది కాదని భావిస్తారు. పైగా వేసవిలో ప్రసవం వల్ల కలిగే ఇబ్బందులతో తల్లి ఇబ్బంది పడుతుందని భావించి.. భార్య భర్తలను ఆషాడ మాసంలో దూరంగా ఉంచే సంప్రదాయం తీసుకువచ్చారు.

గోరింటాకు ఏమంటుంది..

అయితే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదని చాలా మంది చెప్తారు. పైగా చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు కూడా. ఎందుకంటే ఆషాడంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి సీజనల్ సమస్యలు రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకుంటారని భావిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే.. ఆషాడంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చివరికి చేరుతుంది. ఇలా గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి వచ్చిన నీళ్లు శివలింగంపై పడితే పుణ్య ఫలమని భావిస్తారు. సైన్స్ నమ్మినా.. దైవాన్ని నమ్మినా ఆషాడంలో చాలా మంది ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తారు.

తదుపరి వ్యాసం