తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Teaser: మా అక్క వయసెంతో మీకు తెలుసా? పదిహేను సెకన్లలో చెబితే మీరు చాలా స్మార్ట్ అనే అర్థం

Brain Teaser: మా అక్క వయసెంతో మీకు తెలుసా? పదిహేను సెకన్లలో చెబితే మీరు చాలా స్మార్ట్ అనే అర్థం

Haritha Chappa HT Telugu

28 October 2024, 16:30 IST

google News
    • Brain Teaser: ఎప్పటికప్పుడు మీ మేధస్సును ఉత్తేజపరిచే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాలి. వీటినే బ్రెయిన్ టీజర్ అంటాము.  తరచూ బ్రెయిన్ టీజర్‌లు సాల్వ్ చేస్తే మీరు చాలా తెలివైన వారేనని అర్థం.
బ్రెయిన్ టీజర్
బ్రెయిన్ టీజర్ (Pixabay)

బ్రెయిన్ టీజర్

బ్రెయిన్ టీజర్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. మీ మెదడుకు పదునుపెడతాయి. ఎప్పటికప్పుడు మీ మేధస్సుకు పదును పెట్టే బ్రెయిన్ టీజర్లకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాలి. మీ తెలివితేటలకు పదును పెట్టే ప్రశ్నలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. చాలా మంది పోస్ట్ ను చూసి ఒక క్షణం చదివి, వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే మరికొందరు ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందే కామెంట్స్ లో సమాధానం ఏమిటో చూసేస్తారు. అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీలైనంత వరకు బ్రెయిన్ టీజర్ లు సాల్వ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి మన మెదడుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ మేము ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. దీనికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించండి.

ఇదిగో బ్రెయిన్ టీజర్ ప్రశ్న

నాకు 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మా అక్కకి నాకంటే రెట్టింపు వయస్సు ఉంది. ఇప్పుడు నా వయస్సు 30 సంవత్సరాలు. కాబట్టి నా సోదరి వయస్సు ఎంత?

ఈ ప్రశ్న చదవగానే అందరూ ఒకసారి గందరగోళానికి గురయ్యారు. ఈ ప్రశ్నకు చాలా మంది సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకండి. కేవలం 15 సెకన్లలో మీరు జవాబు చెబితే మీరు చాలా తెలివైన వారని అర్థం.

ఇదిగో జవాబు

పైన ఇచ్చిన బ్రెయిన్ టీజర్ కు సమాధానం కోసం వెతుకుతున్నారా? దీనికి సమాధానం 32. ఒక వ్యక్తికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె అక్కకి రెట్టింపు వయసు అంటే… ఆమెకు నాలుగేళ్లు అని అర్థం. దీన్ని బట్టి ఆ వ్యక్తి కన్నా రెండేళ్లు వయసు ఆమెకు ఎక్కువ అని తెలుస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి చెందిన అక్కడ వయసు 32 ఉంటుంది.

చాలా మంది ప్రశ్న చదివాక ఆ వ్యక్తి కన్నా ఆమె అక్క వయసు రెట్టింపు అనుకుంటారు. దీని వల్ల 30 ఏళ్లను కూడా రెట్టింపు చేస్తారు. దీని వల్ల 60 ఏళ్లు అనేది జవాబు అనుకుంటారు. బ్రెయిన్ టీజర్లను జాగ్రత్తగా బుద్ధి పెట్టి పరిష్కరించాలి.

బ్రెయిన్ టీజర్లను తరచూ పరిష్కరించడం వల్ల మెదడుకు వ్యాయామంలా ఉంటుంది. ఇవి అభిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలనుకునే వారు తరచూ బ్రెయిన్ టీజర్లను సాల్వ్ చేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు తరచూ బ్రెయిన్ టీజర్లను అలవాటు చేయడం వల్ల వారిలో క్రిటికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. వారు పెద్దయ్యాక జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా ఎదుర్కోగలుగుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం