Rat Milk Price : లీటర్ ఎలుక పాల ధర 18 లక్షలు.. ఎందుకింత కాస్ట్?
12 September 2023, 11:00 IST
- Rat Milk Price : లీటర్ పాల ధర ఎంతంటే అందరూ ఠక్కున చెప్పేస్తారు. కానీ లక్షల్లో ధర ఉండే పాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఇది నిజంగా నిజం. లీటరుకు 18 లక్షల రూపాయలు కూడా ఉంటాయి.
ఎలుకలు
పాలు తాగాలి అనిపిస్తే.. ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుని తాగుతాం. అది 50 రూపాయల్లోపే ఉంటుంది. ఒకవేళ నేరుగా ఫామ్ నుంచి అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక కాస్ట్లీ మిల్క్ ఏవీ అంటే.. మనకు తెలిసి గాడిద పాలు అని చెబుతాం. దానితో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ లక్షల్లో ధర పలికే పాలు కూడా ఉన్నాయి. అవి ఏదో పెద్ద జంతువుకు చెందినవి అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎలుక పాలు చాలా కాస్ట్లీ. లీటరు ఎలుక పాల ధర 18 లక్షల రూపాయలు.
ఎలుక పాలు చాలా ఖరీదైనవి అన్నమాట. అందుకే అవి దొరకడం అంత ఈజీ కాదు. 30 నిమిషాల ప్రక్రియలో ఎలుక నుంచి కొద్ది మెుత్తం పాలు వస్తాయి. దానికి కూడా చాలా కష్టపడాలి. ఒక లీటర్ ఎలుక పాలు కావాలంటే.. ఎన్ని ఎలుకలు కావాలో తెలుసా? 40 వేల ఎలుకలు అవసరం. అప్పుడే లీటర్ పాలు ఉత్పత్తి అవుతాయి. దీని ధర.. 23వేల యూరోలు.. అంటే సుమారు 18 లక్షల రూపాయలు.
ఎలుకల మీద శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారనే విషయం చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకూ చాలా ప్రయోగాలు వాటి మీద చేసి సక్సెస్ అయ్యారు. అయితే ఎలుక పాల విషయానికి వచ్చేసరికి.. మలేరియా బ్యాక్టీరియాలను చంపే మందులు, పదార్థాలను తయారుచేసేందుకు ఉపయోగిస్తారు. ఎలుకు డీఎన్ఏ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం సులువు అవుతుంది. ఒక్క ప్రయోగం చేయాలంటే.. చాలా వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలుకలు అయితే.. ఈజీగా ఉంటాయి. అందుకే సైంటిస్టుల ల్యాబ్స్ లో ఎలుకలు కనిపిస్తుంటాయి.
40 వేల ఎలుకల నుంచి లీటర్ పాలను తీయాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ పాల ధర ఖరీదైనవి. మాలేరియాను నయం చేసేందుకు ఉపయోగించడంతోపాటుగా పరిశోధనకు అవసరమైనవి తయారుచేసేందుకు కూడా ఎలుక పాలను ఉపయోగిస్తున్నారట. అందుకే ఎలుకలను అంత ఈజీగా తీసి పడేయెుద్దు.
ఇతర జంతువుల్లా ఎలుక వేలకొద్ది లీటర్ల పాలు మాత్రం ఇవ్వదు. ఒక ఆవు ఏడాదికి సుమారు 10 వేల లీటర్ల పాను ఉత్పత్తి చేస్తుంది. మేకలు సంవత్సరానికి వాటి బరువు కంటే.. 12 రేట్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకూ ఉన్న జీవుల్లో బ్లూ వేల్ మాత్రం.. రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ వాటి పాల ధర కంటే.. ఎలుక పాల ధరే విలువైనది.
ఎలుకల మీద చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రయోగశాలలో ఎలుకల పిండాలను రూపొందించడానికి కొత్త పద్ధతులను పరిశోధిస్తున్నారు వైద్యులు. రెండు మగ ఎలుకల నుంచి పిండాన్ని ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ప్రయోగం చేశారు. ఈ పిండాలు ఇతర పిండాల మాదిరిగానే నిర్మాణాలను కలిగి ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. గతంలోనూ ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. చైనాలో ఓ ప్రయోగశాలలో సిజేరియన్ ద్వారా ఓ మగ ఎలుక పది ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. 'ర్యాట్ మోడల్ 6' పేరిట ఈ ప్రయోగాన్ని చేశారు.