తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలుంటే వెంటనేవైద్యుడిని సంప్రదించండి.. !

పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలుంటే వెంటనేవైద్యుడిని సంప్రదించండి.. !

HT Telugu Desk HT Telugu

24 July 2022, 15:31 IST

google News
    • Money Fox: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. కాబట్టి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుండి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. 
money pox Symptoms, causes, prevention and everything you need to know
money pox Symptoms, causes, prevention and everything you need to know

money pox Symptoms, causes, prevention and everything you need to know

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్‌లోనూ మెల్లగా విజృంభిస్తోంది. దేశంలో కొనసాగుతున్న కరోనా సంక్షోభం మధ్య మంకీ ఫాక్స్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు కొత్త మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైంది. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 34 ఏళ్ల మంకీ ఫాక్స్ వ్యాధి బారిన పడ్డాడు . ఇప్పటికే కేరళలో ముగ్గురికి మంకీ ఫాక్స్ వ్యాధి సోకింది .

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది. మంకీపాక్స్ అనేది మశూచిని పోలి ఉండే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఎలుకలు, ముఖ్యంగా కోతుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఇప్పటివరకు 80% కేసులు యూరప్, US, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో నమోదయ్యాయి. మంకీపాక్స్ ప్రధానంగా వ్యాధి సోకిన వారికి సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది.

కోతి వ్యాధి లక్షణాలు ఏమిటి?:

మంకీపాక్స్ సోకిన వారిలో ముఖ్యంగా తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా దీని ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయి. దీని వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి ప్రభావితం కావడం ప్రారంభమవుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. శరీరంలో అనేక రకాల రసాయనాలు విడుదలవుతాయి, దీని కారణంగా కండరాలలో నొప్పి ఉంటుంది. 1 నుండి 2 వారాల మధ్య, చాలా మందికి శరీరంపై దద్దుర్లు మొదలవుతాయి. మంకీపాక్స్ వైరస్ సోకిన కొద్ది రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఈ వైరస్ కోవిడ్ కంటే తక్కువగా వ్వాప్తి చెందుతుంది. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది చాలా త్వరగా వ్యాపించదు. వ్యాధి సోకిన వ్యక్తి నుండి దూరాన్ని పాటించండం ద్వారా సంక్రమణను నివారించవచ్చు.

మంకీపాక్స్‌ను ఎలా నివారించాలి?

ప్రస్తుతం మంకీపాక్స్‌కు సరైన చికిత్స లేదు. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ద్వారా మంకీపాక్స్‌ను కొంత వరకు నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే దీనిని నివారించడానికి ముందస్తు జాగ్రత్తలే ముఖ్యమని వైద్యులు సలహ ఇస్తున్నారు. మంకీపాక్స్‌తో బాధపడుతున్నవారితో సన్నిహింతంగా ఉండకూడదని... వారి వస్తువులకు దూరంగా ఉండటం ద్వారా మంకీపాక్స్‌ వ్యాధిని నివారించవచ్చని అంటున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం