తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : సూర్యుడు పగలే దారి చూపగలడు.. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతోంది

Monday Motivation : సూర్యుడు పగలే దారి చూపగలడు.. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతోంది

HT Telugu Desk HT Telugu

10 April 2023, 4:30 IST

    • Monday Motivation : ఆత్మవిశ్వాసం ఉంటే.. గెలుపు సాధ్యం.. ఇది చాలా మంది చెప్పే మాట. అయితే దానితోపాటుగా.. సాధన కూడా ఉండాలి. చేసే పని మీద పట్టు సాధించాలి. లేకపోతే ఎంత ఆత్మవిశ్వాసం ఉన్న గెలవలేరు. పడిపోతున్నాం అనుకున్నప్పుడు మీకు ప్రేరణను ఇచ్చే విషయాల మీద దృష్టిపెట్టాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనల్ని ఏది ప్రేరేపిస్తుందో మనకు తెలియకపోతే మనం దారి తప్పి సమాధానాల కోసం వెతుకుతూ బుద్ధిహీనంగా తయారవుతాం. కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రేరేపించే అనేక విషయాలు మీ జీవితంలో ఉండవచ్చు. వాహనానికి ఇంధనం ఎలా ముఖ్యమో.. మీరు గెలుపు వైపు నడవాలంటే.. ప్రేరణ కూడా అంతే ముఖ్యం. లేకుంటే.. ఇక ఇంతే అని అక్కడే ఉండిపోతారు. చీమ కూడా మీకు ప్రేరణ కలిగించొచ్చు. చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. వేర్వేరు వ్యక్తులు వారి జీవితంలో వివిధ ప్రేరణ మూలాలను కలిగి ఉంటారు.

ప్రేరణతో పాటు, మన లక్ష్యాలను చేరుకునే వరకు, మన కలలను నెరవేర్చుకునే వరకు మన సంకల్ప శక్తి మనకు సహాయం చేస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి, మీ కలలను నెరవేర్చుకోవడానికి మీరు ప్రయాణిస్తూ ఉంటారు. ఏదో ఒకసారి బలహీనంగా, అలసిపోయే సమయం వస్తుంది. ఆ సందర్భంలో మీకు ఏదీ ప్రేరణ కలిగిస్తుందో అదే ముఖ్యం. మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. మీ కలల కోసం ప్రయత్నించడానికి, మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి మీరు తిరిగి శక్తిని పొందుతారు. అందువల్ల, మీరు ఒత్తిడికి లోనైతే.. మీ ప్రేరణ మూలాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. దానికి తగ్గట్టుగా పని చేయవచ్చు.

మీ మనస్సులో ఎప్పుడూ ఏం ఉంటుంది? దాని గురించి ఆలోచించండి. కొత్త కారు, మీ స్వంత ఇల్లు, ఎక్కువ డబ్బు, పుస్తకం రాయడం? ఇలా ఏదో ఒకటి మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. మీ మనస్సులో ఎప్పుడూ ఉండే వాటిపై శ్రద్ధ వహించండి. మీరు నిద్రపోతున్నా, భోజనం చేసినా, పార్టీలో డ్యాన్స్ చేసినా లేదా మీ ప్రియమైన వారితో గడిపినా, మీరు మీ మనసును దూరంగా ఉంచలేరు. మీ లక్ష్యం దేనిమీద ఉందో దాని గురించి ఆలోచించండి. అదే మీకు ప్రేరణ ఇస్తుంది.

మీరు ఎల్లప్పుడూ దేనికి సమయం కేటాయించాలని ఉత్సాహంగా ఉంటారు? ఉదాహరణకు గాయకుడు కావాలని, లేదా రచయిత కావాలనేది మీ కల .. ఏది ఏమైనప్పటికీ, మీ షెడ్యూల్ ఎంత కఠినంగా ఉన్నా మీరు ఎల్లప్పుడూ దాని కోసం సమయాన్ని వెచ్చించాలి.

జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు, చేయాలనుకుంటున్న విషయాల జాబితాను తయారు చేసి ఉండవచ్చు. ఉదాహరణకు మీరు 30 ఏళ్లు నిండే ముందు మీరు సందర్శించాలనుకుంటున్న స్థలాల జాబితా లేదా మీరు చేయాలనుకుంటున్న పనుల జాబితాను తయారు చేసి ఉండవచ్చు. కాబట్టి జాబితాను పరిశీలించి, జాబితాలో పేర్కొన్న వాటిలో ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకోండి. వెళ్లాలనుకునే ప్రదేశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జీవితంలో ఏదైనా చేయాలంటే.. తప్పకుండా సాధన చేయాలి. ఆత్మవిశ్వాసం, సాధన రెండూ ఉంటే.. విజయం మీ సొంతం అవుతుంది. అందుకే ఏదైనా ప్రయత్నం చేసే ముందు.. ధైర్యంతో పాటుగా దాని గురించి కాస్త తెలిసి ఉండాలి.

సూర్యుడు పగలే దారి చూపగలడు.. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతోంది.. దీనికి సాధన తోడైతే.. విజయం మీ సోంతం అవుతుంది.

తదుపరి వ్యాసం