తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ఓ వ్యక్తి మీపై నమ్మకముంచితే.. మీరు దానిని బ్రేక్ చేయకూడదు..

Monday Motivation : ఓ వ్యక్తి మీపై నమ్మకముంచితే.. మీరు దానిని బ్రేక్ చేయకూడదు..

11 July 2022, 6:30 IST

google News
    • ఒకరు మనపై లేదా.. మనం ఒకరిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి ఆ నమ్మకం, విశ్వాసాన్ని మనం కోల్పోయామా? అది మళ్లీ తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా అది ముందు ఉన్నంత దృఢంగా ఉండదు. అందుకే ఒకరి నమ్మకాన్ని కాపాడుకోవడమనేది చాలా కష్టం. దాన్ని పోగొట్టుకున్నారంటే.. వారిని మీరు మోసం చేసినట్లే.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : నమ్మకం అనేది ఓ భావోద్వేగం. ఒకరిపై పూర్తి విశ్వాసం లేదా నమ్మకాన్ని పొందడానికి సంవత్సరాలు టైమ్ పట్టవచ్చు. కానీ అది నాశనం కావడానికి కేవలం సెకన్లు పడుతుంది. ఒకరు మనల్ని నమ్మారు అంటే అదే ఓ విలువైన బహుమానం. వారు మనల్ని పూర్తిగా నమ్మినప్పుడే ఆ నమ్మకం మనపై కలుగుతుంది. అయితే మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు.. వారి హృదయం ముక్కలవుతుంది. తిరిగి అతుక్కున్న ముందులాగా స్ట్రాంగ్ గా ఉండదు.

ఉదాహరణకు స్టిక్కర్ తీసుకుందాం. దానిని మొదటిసారి అంటించినప్పుడు సులభంగా స్టిక్ అవుతుంది. త్వరగా బయటకు రాదు. అయితే మనం స్టిక్కర్‌ను ఒకసారి తీసివేసి.. మళ్లీ అంటిస్తే.. ఈసారి కూడా అంటుకుంటుంది కానీ.. ముందులాగా బలంగా ఉండదు. అలాగే ట్రస్ట్ కూడా అంతే. ముందు చాలా బలంగా ఉంటుంది. వారు కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఒక్కసారి దానిని బ్రేక్ చేశామా? తిరిగి అతుక్కోవడం కష్టమే. ఈ సమయంలో మీపై నమ్మకముంచిన వారికి కచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. మీ మధ్య గొడవలు కూడా జరగవచ్చు.

మానవ సంబంధాలు వాస్తవానికి భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. ఎందుకంటే డబ్బు కూడా నమ్మకాన్ని కొనలేదు. ఓ వ్యక్తిపై విశ్వాసం అనేది ఒక్కరోజులో పెరగదు. అది అనేక సంవత్సరాల పాటు ప్రయాణించిన తర్వాత ఏర్పడుతుంది. అంత సమయం తీసుకున్నాక ఏర్పడిన ఈ నమ్మకం చాలా బలంగా ఉంటుంది. మీరు దానిని బ్రేక్ చేశారంటే మీకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉండరు.

టాపిక్

తదుపరి వ్యాసం