Candle Light : కొవ్వొత్తి వెలుగుతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందా?
18 February 2023, 19:10 IST
- Mental Health Benefits : కొవ్వొత్తుల వాసన మనిషి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలా మందికి తెలియదు. ఇంట్లో కొవ్వొత్తి వలన మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
కొవ్వొత్తి వెలుగు
పండుగలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాలలో, కొవ్వొత్తులు వెలిగిస్తారు. కొవ్వొత్తిని వెలిగించడం కాంతిని సృష్టించడమే కాదు.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొవ్వొత్తుల సువాసన మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలా మందికి తెలియదు. ఇంట్లో కొవ్వొత్తి వెలిగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నిద్రను మెరుగుపరుస్తుంది
నిద్ర చక్రం అదే మన అంతర్గత జీవ గడియారం. సిర్కాడియన్ రిథమ్ అనేది మనసు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు సూచిస్తుంది. కాబట్టి పడుకునే ముందు కొవ్వొత్తి వెలిగించాలి. దీని జ్వాల నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్ర సమస్యలు ఉన్న వృద్ధులు నిద్రపోయే ముందు గదిలో కొవ్వొత్తి వెలిగించాలి. ఇది మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు తాము నిద్రించే గది లైట్‌ను ఆపేసి.., కొవ్వొత్తులను మాత్రమే వెలిగించాలి. దీని ద్వారా మీకు తెలియకుండానే నిద్ర వస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
మెదడు చేసే అత్యంత ముఖ్యమైన విధుల్లో జ్ఞాపకశక్తి ఒకటి. చాలా మందికి జ్ఞాపకశక్తి సమస్యలు ఉంటాయి. ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జ్ఞాపకం అనేది చాలామందికి ప్రధాన సమస్య. సువాసన గల కొవ్వొత్తిని వెలిగించాలి. ఇది మీ జ్ఞాపకశక్తిలో గందరగోళాన్ని, జ్ఞాపకశక్తి మెరుగుపడేలా సహాయపడుతుందని చెబుతారు. సువాసన మనస్సును ఒక విషయంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
ఆహ్లాదకరమైన మనస్సు
ఆహ్లాదకరమైన సువాసన మనసును ఆకర్షిస్తుంది. ఇది మనసును చురుకుగా ఉంచుతుంది. ఒత్తిడిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. మానసిక అయోమయం, ఒత్తిడిని అదుపులో ఉంచి మనసుకు ఆనందం కలిగిస్తుంది. ఆందోళనకు కూడా తగ్గుతుంది.
ఒత్తిడి నియంత్రణ
కొన్ని కొవ్వొత్తులలోని సువాసన కంటెంట్.. శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని చెబుతారు. ఇది మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది సహజ శక్తి బూస్టర్. అన్ని వేళలా మరింత చురుకుగా ఉండేలా మానసిక శక్తిని ప్రేరేపిస్తుంది.
ఆధ్యాత్మిక ఆరోగ్యం
మీరు ప్రతిరోజూ యోగా, ధ్యానం చేస్తే, సువాసనగల కొవ్వొత్తులు మిమ్మల్ని మీ మనసుకు దగ్గర చేస్తాయి. జాస్మిన్, లావెండర్, పుదీనా ఆహ్లాదకరమైన సువాసన మనసును రిఫ్రెష్ చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు అటువంటి సువాసన గల కొవ్వొత్తిని వెలిగించండి.