Menstrual Hygiene Tips | అమ్మాయిలు పీరియడ్స్ టైమ్‌లో ఆ తప్పులు అస్సలు చేయకండి..
27 May 2022, 10:37 IST
- ఋతుస్రావం సమయంలో సరైన పరిశుభ్రత లేకపోవడం వల్ల, అనారోగ్యకరమైన అభ్యాసాల వల్ల ఇన్‌ఫెక్షన్లు, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని.. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సరైనా పద్ధతులు పాటించకపోతే యోనీ ప్రాంతంలో చర్మ సమస్యలు తప్పవంటున్నారు. పీరియడ్స్ సమయంలో పలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి అంటూ చిట్కాలు సూచించారు.
పీరియడ్ సమయంలో పాటించాల్సిన సూచనలు
Menstrual Hygiene Tips | కొంత మంది మహిళలు, బాలికలు పీరియడ్స్ సమయంలో అవగాహన లేక సరైన కేర్ తీసుకోరు. ఈ నేపథ్యంలో వారు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోని ప్రాంతంలో చికాకు, చర్మం కమలడం, ప్యాడ్ దద్దుర్లు రావడం వంటి సమస్యలతో బాధపడతారు. పైగా ఇప్పటికీ చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో వస్త్రాన్ని ఉపయోగిస్తున్నట్లు పలు అధ్యాయనాలు తెలుపుతున్నాయి. సరైన అవగాహన లేకనే.. వారు క్లాత్ ఉపయోగిస్తున్నారని తేలింది. అయితే పీరియడ్స్ సమయంలో ఎలా ఉండాలో, ప్యాడ్స్‌ను ఎలా బయట పడేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రతి 4-6 గంటలకు శానిటరీ న్యాప్‌కిన్‌లు మార్చాలి..
ఋతుస్రావం రక్తం మన శరీరం నుంచి వివిధ బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. ఆ బ్యాక్టీరియగా రక్తంతో కలిసి... మనకు అసౌకర్యం, దద్దుర్లు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అందుకే మీ శానిటరీ న్యాప్కిన్ను 4 గంటలకు ఒకసారి మార్చండి. దీనివల్ల జననేంద్రియ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
2. ప్యాడ్ మార్చిన ప్రతిసారి ప్రైవేట్ పార్ట్‌ను క్లీన్ చేయండి..
పీరియడ్ సమయంలో మీ యోనిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అతి ముఖ్యంగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారి, ప్యాడ్ మార్చుకున్నప్పుడు కచ్చితంగా యోనిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మీ శానిటరీ నాప్‌కిన్‌ను తీసివేసిన తర్వాత.. బ్యాక్టీరియా మీ శరీరానికి అతుక్కుంటుంది. పైగా యోని నుంచి మలద్వారం వైపునకు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇతర బ్యాక్టిరియా యోని ద్వారా మూత్రనాళాల్లోకి ప్రవేశించే అవకాశముంది.
3. సబ్బులు లేదా ఇతర యోని పరిశుభ్రత ఉత్పత్తులను వాడొద్దు.
మీ దినచర్యకు యోని పరిశుభ్రత ఉత్పత్తులను జోడించడం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ఋతుస్రావం సమయంలో మాత్రం వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. దీనివల్ల సమస్యలు తలెత్తవచ్చు.
4. శానిటరీ నాప్‌కిన్‌ను సరిగ్గా పారవేయండి
సూక్ష్మక్రిములు, అనారోగ్యాలు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్యాడ్లను సరిగా పారేయాలి. వాటిని విసిరే ముందు బాగా చుట్టి ఓ కవర్లో వేసి పడేయాలి. అంతేకానీ వాటిని ఫ్లష్ చేయకూడదు. వాటిని పారవేసిన తర్వాత.. మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
5. మెన్‌స్ట్రువల్ కప్పులు వాడాలి అనుకుంటే..
సిలికాన్ మెన్‌స్ట్రువల్ కప్పులకు మారండి. ఇది చౌకైనది. సురక్షితమైనది. పరిశుభ్రమైనది. అంతేకాకుండా దీనిని శుభ్రం చేసుకుంటూ రెండు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి.. మీకు అవసరమైన కప్పు పరిమాణాన్ని నిర్ధారించుకుని ఆ తర్వాత దీనిని ఉపయోగించండి.
టాపిక్