తెలుగు న్యూస్  /  Lifestyle  /  Menstrual Hygiene Day 2023 Date, History, Significance, And Tips For Periods Hygiene

Menstrual Hygiene Day । ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవాన్ని ఆ రోజునే ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

HT Telugu Desk HT Telugu

27 May 2023, 15:00 IST

    • Menstrual Hygiene Day 2023:  ఋతుస్రావం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అయితే నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి చాలా మందికి అవగాహన ఉండదు, అవగాహన కోసం ప్రతీ ఏడాది మే 28న ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవంగా పాటిస్తున్నారు.
Menstrual Hygiene Day 2023
Menstrual Hygiene Day 2023 (Unsplash)

Menstrual Hygiene Day 2023

Menstrual Hygiene Day 2023: మహిళలకు ప్రతీనెల ఋతుస్రావం అనేది సర్వసాధారణం. ఋతుస్రావం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అయితే నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి చాలా మందికి అవగాహన ఉండదు, కొందరికి ప్యాడ్స్ కూడా అందుబాటులో ఉండవు. ఇది కాకుండా నెలసరి సమయంలో ఆడవారిని దూరంగా ఉంచడం, అంటరాని వారిలా చూడటం, కొన్నిమూఢనమ్మకాలను పాటించడం కూడా చాలా చోట్ల ఇప్పటికీ గమనించవచ్చు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రతీ ఏడాది మే 28న ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవంగా పాటిస్తున్నారు.

పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, ఋతుస్రావం చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించడానికి, పీరియడ్స్ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించి ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచడానికి మే 28న ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తారు.

ఋతుచక్ర పరిశుభ్రత రోజును మే 28న తేదీనే ఎందుకు జరుపుకుంటారు?

ఋతుచక్ర పరిశుభ్రత రోజును మే 28న తేదీనే నిర్వహించటానికి ఒక అర్థం ఉంది. అదేమిటంటే.. ఆడవారికి పీరియడ్ సైకిల్ ప్రతీనెల ఉంటుంది. ఇది సగటున 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. అందుకే 28వ తేదీని ఎంచుకున్నారు. అలాగే ఈ పీరియడ్స్ అనేవి సగటున 5 రోజుల పాటు కొనసాగుతాయి. మనకు సంవత్సరంలో ఐదవ నెల మే, అందుకే మే 28వ తేదీని ఋతుచక్ర పరిశుభ్రత రోజుగా ఎంచుకున్నారు.

ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవం 2023 ఏడాది థీమ్ ఏమిటంటే.. '2030 నాటికి పీరియడ్స్ అనేవి సాధారణ ప్రక్రియ, వీటిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేకుండా మార్చడం.

ఋతు పరిశుభ్రత రోజు చరిత్ర

2013లో జర్మనీకి చెందిన వాష్ యునైటెడ్ ఆనే NGO మెన్‌స్ట్రువల్ హైజీన్ డేని ప్రారంభించింది, 28 రోజుల సోషల్ మీడియా ప్రచారం, ఋతుస్రావం వివిధ అంశాల గురించి అవగాహన కల్పించడానికి ప్రారంభించబడింది. వీరు ప్రచారానికి వచ్చిన సానుకూల స్పందనతో ప్రేరణ పొంది మరిన్ని ర్యాలీలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, ప్రసంగాలు నిర్వహించారు. ఈ క్రమంలో మొదటిసారిగా మే 28, 2014న ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవాన్ని పాటించారు. ఇది ఇలాగే ప్రతీ ఏడాది కొనసాగుతుంది.

ఋతుచక్ర పరిశుభ్రత అంటే ఏమిటి?

ఋతుచక్ర పరిశుభ్రత అంటే ఋతుస్రావం సమయంలో రక్త ప్రవాహాన్ని గ్రహించే లేదా సేకరించే ఉత్పత్తుల వాడకం మొదలుకొని, పీరియడ్ ఉన్నన్నీ రోజులు యోని ప్రాంతంను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం. ఇది అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా, సౌకర్యవంతమైన నెలసరిని కలిగి ఉండటం గురించి నొక్కి చెబుతుంది.