తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swapna Shastra : ఏ సమయంలో వచ్చిన కల నిజమవుతుంది? ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది?

Swapna Shastra : ఏ సమయంలో వచ్చిన కల నిజమవుతుంది? ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది?

Anand Sai HT Telugu

14 November 2023, 18:30 IST

google News
    • Meaning Of Dreams : కలల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. కొన్ని కలలు నిజమవుతాయని మనం వినే ఉంటాం. అయితే అవి నెరవేరడానికి వచ్చే సమయం కూడా ముఖ్యమే. స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..
స్వప్న శాస్త్రం
స్వప్న శాస్త్రం (unsplash)

స్వప్న శాస్త్రం

పొద్దున వచ్చే కలలు నిజమవుతాయని చాలా మంది చెప్పడం మనం విన్నాం. కలలు రాత్రి, పగలు వస్తాయి. మధ్యాహ్నం నిద్రపోయినా కొన్నిసార్లు వచ్చేస్తాయి. ఇంతకీ కల ఎప్పుడు నెరవేరుతుందో మీకు స్పష్టమైన సమాచారం తెలుసా? దీని గురించి స్వప్న శాస్త్రం చాలా విషయాలు చెబుతుంది.

మనం అందరం రాత్రి పడుకున్నప్పుడు కలలు(Dreams) కంటాం. కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. తీపి కల, పీడకలలు వస్తుంటాయి. కొన్నిసార్లు భయానక కలలు భయపెడతాయి. కొన్నిసార్లు ఫన్నీ కలలు కూడా వస్తాయి. కొన్ని నిగూఢమైన కలలు మనల్ని రోజంతా ఆలోచించేలా చేస్తాయి. వాటి గురించి అర్థంకాక తల గొక్కుంటాం. ప్రతి కల ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది.

డ్రీమ్ సైన్స్(Dream Science) ప్రకారం, కల నిర్దిష్ట సమయం, అది వాస్తవంగా మారుతుందో లేదో చెబుతుంది. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య చూసిన కలలు నెరవేరవు. సాధారణంగా ఈ కలలు మనసుపై పగటిపూట జరిగిన సంఘటనల ప్రభావం. అందుకే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య చూసిన కలలు నిజమవుతాయి. కానీ అవి కార్యరూపం దాల్చడానికి సాధారణంగా ఏడాది పడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలుగా కూడా నిజమవుతాయని చెబుతారు.

బ్రహ్మ ముహూర్తం(brahma muhurtha) సూర్యోదయానికి ముందు ఉదయం 4:24 నుండి 5:12 వరకు (లేదా ఉదయం 4, 5:30 మధ్య) ఉంటుంది. బ్రహ్మ ముహూర్తాన్ని సృష్టి కాలం అని కూడా అంటారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి దేవుడిని పూజించాలని అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో వచ్చిన కల నెరవేరడానికి 1 నుంచి 6 నెలల సమయం పట్టవచ్చు. ఒక వ్యక్తి తన ఆత్మకు చాలా దగ్గరగా ఉండే సమయం ఉదయం. అలాగే ఈ సమయంలో దైవిక శక్తులు చురుకుగా మారతాయి. వాటి ప్రభావం భూమిపై ఉన్న ప్రతి జీవి, నిర్జీవ వస్తువుపై పడుతుంది. ఈ సమయంలో కనిపించే కల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. మనసులో తలెత్తే ఆలోచనలే కాకుండా, కలలు భవిష్యత్ సంఘటనలను కూడా సూచిస్తాయి. అన్ని కలలు నిజం కానప్పటికీ, ప్రతి కల దాని స్వంత అర్థాన్ని కలిగి ఉంటుంది.

తదుపరి వ్యాసం