Bones Strong Foods : నాన్ వెజ్ తినకుండా మీ ఎముకలను స్ట్రాంగ్ చేసుకోండి ఇలా
25 December 2023, 9:22 IST
- Bones Strong Veg Foods : ఎముకలను బలంగా ఉంచుకోవాలి. అందుకోసం నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల వెజ్ ఫుడ్స్ తిని మీ ఎముకలను స్ట్రాంగ్ చేసుకోవచ్చు.
ఎముకల ఆరోగ్యం
మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. అందుకే నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను కచ్చితంగా పాటించాలి. ఎముకలను బలోపేతం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు బలంగా ఉంటే శారీరక ఎదుగుదలకు దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం అనేక రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఎముకలను బలంగా చేసుకునేందుకు కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం..
గుడ్డు, మాంసాహారం ద్వారా కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. కానీ శాఖాహారులు నాన్ వెజ్ తినలేరు. దీంతో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ లోపాన్ని కొన్ని శాఖాహార ఆహారాలు తిని కూడా భర్తీ చేసుకోవచ్చు. ఎముకలకు బలాన్నిచ్చే శాఖాహారాలు కొన్ని చూద్దాం..
రాగి కాల్షియం యొక్క మంచి మూలంగా పరిగణిస్తారు. రాగులతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా చెబుతారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అవి రెండూ ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి.
బచ్చలికూర ఎముకలకు కాల్షియం అందించేందుకు మంచి మూలం. మీ ఎముకలను బలోపేతం చేయడానికి మీ ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా చేర్చుకోండి. బచ్చలికూర తీసుకోవడం వల్ల ఎముకలకు రోజువారీ అవసరమైన కాల్షియంలో 25 శాతం లభిస్తుంది. ఆకుల్లో ఐరన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి.
జున్ను అనేది కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడటం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీ రోజువారీ జీవితంలో జున్ను తీసుకోవడం పెంచాలి. ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు కూడా తినవచ్చు.
టోఫు విటమిన్లతో పాటు కాల్షియం యొక్క మంచి మూలంగా చెబుతారు. ఇది శరీరంలోని అనేక పోషకాల లోపాన్ని తగ్గించేందుకు సాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, ఇతర పోషకాలు అందుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మీరు మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే, మీ దినచర్యలో పాలు, పనీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను పెంచాలి. పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
ఎముకలను బలంగా చేసేందుకు బాదంపప్పును తినండి. ఎందుకంటే బాదం శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బాదంతో జుట్టు, కళ్ళకు కూడా మంచిది. బాదంపప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్‌లు ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.
ఆరోగ్య స్పృహ ఉన్నవారికి సోయాబీన్స్ ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. సోయాబీన్స్‌లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.