తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee: ఆవు పాలు, గేదె పాలు వాడకుండా దేశీ నెయ్యిని ఇలా తయారుచేసేయండి, ఇదెంతో ఆరోగ్యకరం కూడా

Ghee: ఆవు పాలు, గేదె పాలు వాడకుండా దేశీ నెయ్యిని ఇలా తయారుచేసేయండి, ఇదెంతో ఆరోగ్యకరం కూడా

Haritha Chappa HT Telugu

06 November 2024, 9:30 IST

google News
    • Ghee: పాలు లేకుండా దేశీ నెయ్యి తయారు చేయడం కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు. రుచి, ఆరోగ్యంలో ఇది సాధారణ పాల నెయ్యిలాగనే ఉంటుంది. 
పాలు లేకుండా నెయ్యి తయారీ ఇలా
పాలు లేకుండా నెయ్యి తయారీ ఇలా (Shutterstock)

పాలు లేకుండా నెయ్యి తయారీ ఇలా

దేశీ నెయ్యి కచ్చితంగా తినాల్సిన భారతీయ వంటకం.  కూరల్లో, స్వీట్లలో, బిర్యానీల్లో దీన్ని ఒక రెండు స్పూన్లు వేస్తే చాలు ఘుమఘుమలాడిపోతుంది.  ఇది లేకుండా చాలా వంటకాలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. వంటగదిలో దేశీ నెయ్యి వాసన వస్తేనే పరాఠాలు, రోటీలు, చపాతీలు టేస్టీగా ఉంటాయి. నెయ్యిని వేయగానే ఆహారానికి ఒక్కసారిగా రుచి పెరిగిపోతుంది.  

ఈ రోజుల్లో శాకాహారి డైట్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. దీన్ని వీగనిజం అని కూడా అంటారు. వీగన్ ఆహారంలో భాగంగా జీవుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని కూడా తినరు. అంటే ఆవు పాలు, ఆ పాలతో తయారు చేసే నెయ్యి, చీజ్ ఉత్పత్తులు కూడా తినరు.   అటువంటప్పుడు వేగనిజం పాటించేవారు దేశీ నెయ్యిని రుచి చూడలేరు. కానీ మీరు పాలు లేకుండా దేశీ నెయ్యిని తయారు చేయవచ్చని మీకు తెలుసా? అది కూడా చాలా చవకగా, సులభమైన మార్గంలో చేసేయచ్చు. ఇది రుచిలో నెయ్యిని పోలి ఉంటుంది. సాధారణ నెయ్యిలానే దీన్ని ఉపయోగించుకోవచ్చు.  

పాలు లేకుండా నెయ్యి తయారీ

శాకాహార నెయ్యి తయారు చేయడానికి సులువుగా మార్కెట్లో లభించే వస్తువులనే వినియోగించాలి.  దీన్ని తయారు చేయడానికి అరకప్పు కొబ్బరి నూనె, రెండు టీస్పూన్ల సన్ ఫ్లవర్ నూనె, రెండు టీస్పూన్ల నువ్వుల నూనె, అయిదు తాజా జామ ఆకులు (జామ ఆకులు అందుబాటులో లేకపోతే కరివేపాకును ఉపయోగించవచ్చు), ఇక టీస్పూన్ పసుపు అవసరం పడతాయి. వీటితో ఎంతో సులువుగా నెయ్యిని తయారుచేయవచ్చు.

శాకాహారి దేశీ నెయ్యి తయారుచేసే విధానం చాలా సులభం. దీని కోసం, మొదట మూడు నూనెలు.. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ నూనె ఒక గిన్నెలో వేసి కలపాలి.  స్టవ్ మీద కళాయి పెట్టి ఆ మూడు నూనెలను వేసి చిన్న మంట మీద వేడి చేయాలి.  ఇప్పుడు జామ ఆకులు లేదా కరివేపాకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో నీరు కలపకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ పేస్టును కూడా నూనెల్లో వేసి వేడి చేయాలి. అలాగే పసుపును కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అరగంట పాటూ వేడి చేశాక స్టవ్ ఆఫ్ చేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత బాగా వడకట్టి ఒక సీసాలో వేయాలి. అంతే నెయ్యి తయారైనట్టే.  దీన్ని ఫ్రిజ్ లో పెడితే గట్టిగా మారుతుంది. ఇది అచ్చం ఆవు నెయ్యి లాగానే ఉంటుంది. కేవలం చూడటానికే కాదు, దాని రుచి కూడా దేశీ నెయ్యి మాదిరిగానే ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ సులువైన రెసిపీతో వీగన్ నెయ్యిని తయారు చేసేయండి. సాధారణ నెయ్యితో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో సిద్ధమైపోతుంది.

వీగనిజం పాటించే వారి సంఖ్య ప్రపంచంలో పెరిగిపోతోంది. వీరు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. చివరికి లెదర్ తో చేసిన ఉత్పత్తులను కూడా వినియోగించరు. పాలు, తేనె వంటివి కూడా తీసుకోరు. 

 

టాపిక్

తదుపరి వ్యాసం