తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Misal Pav: మహారాష్ట్ర స్పెషల్ మిసల్ పావ్.. వన్ పాట్ రెసిపీ..

Misal pav: మహారాష్ట్ర స్పెషల్ మిసల్ పావ్.. వన్ పాట్ రెసిపీ..

HT Telugu Desk HT Telugu

19 September 2023, 6:30 IST

google News
  • Misal pav: మహారాష్ట్ర వంటకం మిసల్ పావ్ కి రుచిలో తిరుగుండదు. దాన్ని సులువుగా ఒకే కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి. 

మిసల్ పావ్
మిసల్ పావ్ (https://creativecommons.org/licenses/by-sa/4.0)

మిసల్ పావ్

మనం అల్పాహారంలోకి బ్రెడ్ తో చేసే చాలా వంటకాలు తింటుంటాం. బ్రెడ్ లేదా పావ్ తో సర్వ్ చేసుకునే మహారాష్ట్ర స్పెషల్ మిసల్ పావ్. బ్రెడ్, మొలకలతో చేసిన కూరను కలిపి తినే మంచి రుచికరమైన వంటకం. దీన్ని ఉదయం అల్పాహారంలోకి, సాయంత్రం స్నాక్ టైం లో కూడా తినేయొచ్చు. దీన్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల మొలకెత్తిన పెసర్లు

6 నుంచి 8 పావ్ (లేదా బ్రెడ్ రోల్స్)

1 కప్పు కారప్పూస

1 కప్పు ఉల్లిపాయ ముక్కలు

సగం కప్పు టమాటా ముక్కలు

సగం చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

2 చెంచాల నూనె

అర టీస్పూన్ ఆవాలు

అర టీస్పూన్ జీలకర్ర

చిటికెడు ఇంగువ

1 కరివేపాకు రెబ్బ

1 చెంచా కొబ్బరి తురుము

1 చెంచా నిమ్మరసం

2 చెంచాల మిసల్ మసాలా (మార్కెట్ లో సులువుగా దొరుకుతుంది)

సగం చెంచా కారం

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. ప్రెజర్ కుక్కర్ లో ఒక చెంచా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేగనివ్వాలి.
  2. టమాటాలు కూడా వేసుకుని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి.
  3. ఈ మిశ్రమం చల్లారాకా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
  4. కుక్కర్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కలుపుకోవాలి. మొలకెత్తిన పెసర్లు, కారం, ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మిసల్ మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా వీటిని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర కలుపుకుని స్టవ్ కట్టేయాలి.
  6. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఈ కర్రీని వేసుకుని మీద ఉల్లిపాయ ముక్కలు, కారప్పూస వేసుకుని బ్రెడ్ తో సర్వ్ చేసుకుంటే చాలు.

తదుపరి వ్యాసం