తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon - Vegetables | వర్షాకాలంలో ఏయే కూరగాయలు తినాలి? వేటిని తినకూడదు?

Monsoon - Vegetables | వర్షాకాలంలో ఏయే కూరగాయలు తినాలి? వేటిని తినకూడదు?

HT Telugu Desk HT Telugu

27 July 2023, 12:36 IST

google News
    • Monsoon friendly Vegetables: వర్షాకాలంలో ఎయే కూరగాయలు తినడం మంచిది, వేటిని నివారించాలో ఈ కింద చూడండి.
Monsoon - Vegetables
Monsoon - Vegetables (istock)

Monsoon - Vegetables

Monsoon - Vegetables: వర్షాకాలంలో అంటువ్యాధులు, చర్మవ్యాధులు మొదలుకొని ఇన్ఫెక్షన్లు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండపోతే అనారోగ్యాల పాలవడం తప్పదు, ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో బయట అపరిశుభ్ర వాతావరణంలో చేసే ఆహారాలను, పానీయాలను నివారించాలి. ఇంట్లో వండిన వాటికి ప్రాధాన్యతనివ్వాలి. రోడ్డు పక్కన చేసే డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

వర్షాకాలంలో సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు, మీరు ఇంట్లో వండిన ఆహారం తింటున్నప్పటికీ అందులోనూ కొన్ని నియమాలు పాటించాలి. మాన్‌సూన్‌ లో ఎక్కువగా కూరగాయలు తినాలి, అయితే మార్కెట్లో లభించే అన్ని కూరగాయలు వర్షా ఋతువుకు తగినవి కావు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని కూరగాయలు జీర్ణ అగ్నికి అంతరాయం కలిగిస్తాయి. వర్షాకాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, బచ్చలికూర వంటివి తింటే అవి మీ జీర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, ఈ వర్షాకాలంలో వాటిని తప్పనిసరిగా నివారించాలి అని ఆయుర్వేదం చెబుతుంది. వర్షాకాలంలో ఎయే కూరగాయలు తినడం మంచిది, వేటిని నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు

ఈ వర్షాకాలంలో మీ ఆహారంలో చేర్చుకోగల కూరగాయల జాబితాను ఈ కింద చూడండి. ఈ కూరగాయలను తినడం ద్వారా మీ జీర్ణవ్యవస్థకు సహాయపడవచ్చు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నిరోధించవచ్చు.

1. సోరకాయ

ఆయుర్వేదం ప్రకారం సోరకాయ ప్రకృతి సిద్ధంగా తీపి, శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. వర్షాకాలంలో సోరకాయ తినడం మీ జీర్ణవ్యవస్థకు మంచిది. సోరకాయను అనేక రకాలుగా వండుకొని తినవచ్చు. ఈ కూరగాయ ఆకలి పుట్టించేలా పనిచేస్తుంది, శరీర బలాన్ని పెంచుతుంది. దీనిలోని పోషకాలు పిత్త దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి, జీర్ణక్రియలో సహాయపడతాయి.

2. బీరకాయ

వర్షాకాలంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కూరగాయలలో బీరకాయ ఒకటి. ఈ సీజన్ లో బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవాలి. బీరకాయ కఫ, పిత్త దోషాలను తొలగిస్తుంది. ఆకలిని పెంచుతుంది, బలాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది (దీపన). ఇది తేలికపాటి భేదిమందుగా కూడా పనిచేస్తుంది. చర్మ వ్యాధులు, రక్తహీనత, వాపు ఉన్నవారికి కూడా బీరకాయ తినడం సిఫార్సు చేయబడింది.

3. దిల్ పసంద్

వర్షాకాలంలో తినాల్సిన ఉత్తమమైన కూరగాయలలో దిల్ పసంద్ కూడా ఒకటి. ఇది కఫ, వాత దోషాలను నివారిస్తుంది. కడుపులో తేలికగా ఉంటుంది, సులభంగా జీర్ణమయ్యేదిగా చేస్తుంది. ఈ సీజన్‌లో మీకు సరైన హైడ్రేషన్ అందించడంలో కూడా దిల్ పసంద్ మేలు చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, ఉబ్బరాన్ని తొలగిస్తుంది. అనోరెక్సియా సహా ఇతర ఇన్ల్ఫమేటరీ రుగ్మతలను నయం చేస్తుంది.

వర్షాకాలంలో నివారించాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఏవి తినకూడదో తెలుసుకోండి.

1. క్యాప్సికమ్

క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్స్ లేదా షిమ్లా మిర్చి కూరగాయలను వర్షాకాలంలో తినకూడదు. క్యాప్సికమ్ అగ్నికి (జీర్ణసంబంధమైన మంట) భంగం కలిగిస్తుంది, ఇది ఆమ్లపిత్త (ఆమ్లత్వం), వాత దోషాలను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, మీరు వర్షాకాలంలో ఎసిడిటీ, ఉబ్బరం సమస్యలను ఎదుర్కోకూడదనుకుంటే, ఈ వెజ్జీకి దూరంగా ఉండండి.

2. పాలకూర

ఆయుర్వేద నిపుణుల ప్రకారం వర్షాకాలంలో ఐరన్ అధికంగా ఉండే కూరగాయలకు దూరంగా ఉండాలి. పాలకూర వల్ల జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వర్ష ఋతువు సమయంలో పాలకూరను తింటే ఇది వాత, పిత్త దోషాలను తీవ్రతరం చేస్తుంది. శరీరంలో కఫ దోషాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్‌ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది.

3. కాలీఫ్లవర్

ఆయుర్వేదం ప్రకారం, వర్షా ఋతువులో కాలీఫ్లవర్ సిఫార్సు చేయకూడదు ఎందుకంటే ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దాని శీతల (శీతలీకరణ) , ద్రవ (నీటి) స్వభావం జఠరాగ్ని (జీర్ణ అగ్ని)కి ఆటంకం కలిగిస్తాయి. ఇది వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. శరీరంలోని కఫా, పిత్త దోషాలను తగ్గిస్తుంది.

4. క్యాబేజీ

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో క్యాబేజీని కూడా నివారించాలి. దాని శీతల (శీతలీకరణ), గురు (భారీ) లక్షణాలు వర్షాకాలంలో అగ్ని (జీర్ణ అగ్ని) దెబ్బతిస్తాయి.

5. టొమాటోలు

వర్షాకాలంలో టొమాటోలు ఎసిడిటీని కలిగిస్తాయి కాబట్టి వాటిని దాటవేయవచ్చు. టమోటాలోని వేడి, పుల్లని లక్షణాలు ఆమ్లపిత్త (అమ్లత్వం), త్రిదోషాన్ని తీవ్రతరం చేస్తాయి.

తదుపరి వ్యాసం