తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Avoid With Ibs । పేగులో ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు తినకూడదు!

Foods to Avoid with IBS । పేగులో ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు తినకూడదు!

HT Telugu Desk HT Telugu

27 July 2023, 10:49 IST

    • Foods to Avoid with IBS: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ తో బాధపడేవారు కొన్ని ఆహారాలను నివారించడం మేలు, లేదంటే లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇక్కడ తెలుసుకోండి.
Foods to Avoid with IBS
Foods to Avoid with IBS (istock)

Foods to Avoid with IBS

Foods to Avoid with IBS: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ (IBS) అనేది పేగుల్లో అసాధారణ కదలికల వల్ల కలిగే ఒక అనారోగ్య పరిస్థితి. దీనివలన కడుపులో అసౌకర్యంతో పాటు, మల విసర్జనలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వారిలో, గతంలో పేగులు, జీర్ణవ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారికి

ఏదైనా తిన్నప్పుడు అది సరిగ్గా జీర్ణం కాక కడుపులో గడబిడగా ఉంటుంది. చక్కెర పదార్థాలు, గ్లూటెన్ కలిగిన పదార్థాలు, కొవ్వులు మొదలైనవి తిన్నప్పుడు కడుపులో మంట తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే మొట్టమొదటగా చేయాల్సిన పని ఆహారంలో మార్పులు చేసుకోవడం, తినే ఆహారాలను జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

IBSతో బాధపడేవారు కొన్ని ఆహారాలను నివారించడం మేలు, లేదంటే లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇక్కడ తెలుసుకోండి.

ప్రాసెస్ చేసిన మాంసాలు

ప్రాసెస్ చేసిన మాంసాలలో సాధారణంగా కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి, ఇవి IBS ఉన్నవారికి వారి జీర్ణవ్యవస్థను చాలా కష్టపెడతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలలో నైట్రేట్స్ వంటి సంకలితాలు కూడా ఉంటాయి, ఇవి శరీరానికి జీర్ణం కావడం కష్టం, పేగు వాపుకు దారితీయవచ్చు.

శుద్ధి చేసిన పిండి పదార్థాలు

శుద్ధి చేసిన పిండి పదార్థాలలో వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా, మైదాతో చేసే ఇతర పదార్థాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో చక్కెరలు ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు, ఇలాంటివి IBS తో బాధపడేవారు తింటే జీర్ణం కావు, కడుపులో మంటను కలిగిస్తాయి.

కృత్రిమ స్వీటెనర్లు

కృత్రిమ స్వీటెనర్లు తరచుగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, అవి చక్కెర కంటే ఎక్కువగా జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. కొన్ని కృత్రిమ స్వీటెనర్లు చక్కెర కంటే తక్కువ కేలరీలను కలిగి ఉన్నప్పటికీ, IBS ఉన్నవారిలో ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి.

కెఫిన్ పానీయాలు

కెఫిన్ పానీయాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి, ఇది IBS ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది.

డెయిరీ ఉత్పత్తులు

డెయిరీ ప్రొడక్ట్స్ శరీరానికి జీర్ణం కావడం కష్టం, ముఖ్యంగా IBS ఉన్న వారికి. పాల ఉత్పత్తులలో లాక్టోస్ కూడా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థలో సరిగ్గా విచ్ఛిన్నం కాకపోతే గ్యాస్, ఉబ్బరం పెరుగుతుంది.

కాబట్టి, మీరు మీ IBS లక్షణాలను మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలంటే పైన పేర్కొన్న ఆహార ఉత్పత్తులను కచ్చితంగా నివారించాలి. అలాగే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సను తీసుకోవడం మరిచిపోవద్దు.

తదుపరి వ్యాసం