తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stomach Infection। నీరు తాగినా వాష్ రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఇన్ఫెక్షన్ కావచ్చు!

Stomach Infection। నీరు తాగినా వాష్ రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఇన్ఫెక్షన్ కావచ్చు!

HT Telugu Desk HT Telugu

26 July 2023, 8:15 IST

    • Stomach Infections in Monsoon: వర్షాకాలంలో కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అది స్టమక్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సంక్రమణ లక్షణాలు, నివారణ మార్గాలు చూడండి. 
Stomach Infections in Monsoon
Stomach Infections in Monsoon (istock)

Stomach Infections in Monsoon

Stomach Infections in Monsoon: వర్షాకాలంలో మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజుల్లో ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువగా పెరిగింది. కానీ, బయట అపరిశుభ్ర వాతావరణంలో చేసే ఆహారాలను తినడం వలన చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ ఆహారాలు మీ కడుపులో గడబిడను సృష్టిస్తాయి. ఈగలు వాలినవి, కలుషిత నీటితో చేసినవి, శుచి శుభ్రత పాటించకుండా వండిన ఆహారాలలో అనేక రోగకారక క్రిములు ఉంటాయి. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు మీ కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల కడుపునొప్పి, పేగుల్లో మంట, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణవ్యవస్థ చాలా బలహీనపడుతుంది, మీరు నీరు తాగినా కూడా జీర్ణం కాదు. లూజ్ మోషన్స్ అవుతాయి. మీరు నీరు త్రాగిన వెంటనే వాష్ రూమ్ కు పరుగులు పెట్టాల్సివస్తే, మీ కడుపులో ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోండి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి, పరిస్థితి నుంచి బయటపడే మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కడుపు ఇన్ఫెక్షన్ లక్షణాలు

  • తీవ్రమైన కడుపు నొప్పి
  • కడుపులో తిప్పటం
  • వాంతులు
  • ఆకలి లేకపోవడం
  • మలంలో రక్తం రావడం
  • తరచుగా త్రేనుపులు
  • నిర్జలీకరణము
  • వేగవంతమైన హృదయ స్పందన
  • తలనొప్పి
  • అతిసారం
  • జీర్ణ సమస్యలు

బయటపడే మార్గాలు ఏమిటి?

కడుపు ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవటానికి, ముందుగా మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా వహించాలి. మీకు కడుపు ఇన్ఫెక్షన్ ఉంటే, ఇంట్లో వండిన తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోండి, వేడివేడిగా తినండి. ఖిచ్డీ, దాల్ రైస్ వంటివి తినాలి. పెరుగు, మజ్జిగ తీసుకోవాలి, ఎలక్ట్రోలైట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఓఆర్ఎస్ వంటివి తాగవచ్చు. కాచి చల్లార్చిన శుద్ధమైన నీటిని తాగండి.

దానిమ్మ గింజలు తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మీ పేగులో మంటను తగ్గించడానికి పని చేస్తుంది. కడుపు ఇన్ఫెక్షన్ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.

కడుపు నొప్పిని ఎదుర్కోవటానికి ఆల్కహాల్ పూర్తిగా మానుకోండి. అల్కాహాల్ వలన మీరు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావచ్చు. దీనివలన డీహైడ్రేషన్ సంభవించవచ్చు.

అరటిపండు తినడం వల్ల కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది, ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది, కడుపుని కూడా నయం చేస్తుంది.

ఎలాంటి ఆహారాలు నివారించాలి?

మీకు కడుపు ఇన్ఫెక్షన్ ఉంటే, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్, డయేరియా సమస్య పెరుగుతుంది. అలాగే వేయించిన వాటిని తినడం మానుకోవాలి. మాంసాహారాలకు దూరంగా ఉండాలి, బాగా ఉడికించిన కూరగాయలు తినడం మేలు చేస్తుంది.

మీకు కడుపు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు, కడుపు నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు మీరు తక్షణమే వైద్య సహాయం పొంది, సరైన చికిత్స పొందడం ఉత్తమం. ఇక్కడ పేర్కొన్న చిట్కాలు కేవలం మీ అవగాహన కోసమే. ఏం తినాలి, ఏం తినకూడదో వైద్యులను సంప్రదించి ముందుకు వెళ్లండి.

తదుపరి వ్యాసం