తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pcos | పీసీఓస్​తో బాధపడుతున్నారా? అయితే మీ లైఫ్​స్టైల్ ఇలా మార్చేసుకోండి..

PCOS | పీసీఓస్​తో బాధపడుతున్నారా? అయితే మీ లైఫ్​స్టైల్ ఇలా మార్చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

27 April 2022, 7:46 IST

    • పీసీఓఎస్​ అనేది జీవక్రియ రుగ్మత. ఇది స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారు తమ జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. తద్వారా వాటి దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. బలహీనత లక్షణాల నుంచి కోలుకోవచ్చు. ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పీసీఓఎస్ లక్షణాలు
పీసీఓఎస్ లక్షణాలు

పీసీఓఎస్ లక్షణాలు

Lifestyle For PCOS | దాదాపు మహిళలును ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలు. భారతదేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు హార్మోన్ల రుగ్మత కారణంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS) అనే సిస్టిక్ సిస్ట్‌తో బాధపడుతున్నారు. రుతుక్రమ సమస్యలు, హార్మోన్లలో అసమతుల్యత, ముఖం, శరీర భాగాలపై వెంట్రుకలు పెరగడం, మొటిమలు రావడం, పురుషుల వలె బట్టతల రావడం వంటివి పీసీఓఎస్​లోని కొన్ని లక్షణాలు. పీసీఓఎస్​ ఉన్నవారిలో రుతుక్రమం ఆగిపోయి.. స్త్రీలు గర్భాశయంలో సిస్ట్‌లు ఏర్పడతాయి. దీనివల్ల వారు గర్భం దాల్చలేరు. దీనికి ఒకే చికిత్స లేనప్పటికీ.. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేయవచ్చు. దీని ద్వారా పీసీఓఎస్​ నివారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Milk Ghee Benefits : రాత్రి పడుకునే ముందు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాగండి

Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!

Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Never Eat Foods : ఖాళీ కడుపుతో ఈ 5 ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసుకోండి

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఋతు చక్రం సక్రమంగా ఉంటుంది. కార్డియో శిక్షణ. యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ లోపంతో పోరాడవచ్చు. ఇది ఫలదీకరణం అవకాశాన్ని పెంచుతుంది. అంతేకాకుండా కండరాల ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది

ధ్యానం

ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం మానసిక ఆరోగ్యానికే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని నివారించండి

ఒత్తిడిని నివారించడానికి నృత్యం, పాట, సంగీతం, తోట నిర్వహణ మొదలైనవి చేయవచ్చు. ఇలా ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. కూరగాయలు, పండ్లు, ఫైబర్, మోనో లేదా బహుళఅసంతృప్త కొవ్వులు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. సంతృప్త కొవ్వులను తీసుకోవడం మానేయండి. అదేవిధంగా, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. మీ ఆహారంలో అధిక ఫైబర్ ఉండేలా చూసుకోండి. గట్ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. తృణధాన్యాలు, విత్తనాలు, చిక్కుళ్ళు కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

వీటికి కచ్చితంగా నో..

ధూమపానం, ఆల్కహాల్, నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మిఠాయిలు, ప్యాక్ చేసిన స్నాక్స్ మొదలైన వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు తినడం వల్ల మంట వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ స్రావాన్ని ప్రభావితం చేసే పాల ఉత్పత్తులు, వెన్న మొదలైన వాటిని తీసుకోకపోవడమే మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం